తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్ కేసు - విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును విచారించిన పోలీసులు - Telangana Phone Tapping Case - TELANGANA PHONE TAPPING CASE

TS Phone Tapping Case Updates : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తుల్తో టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో దొంగచాటుగా నగదు తరలింపు అంశం బహిర్గతమైంది. ఇందులో భాగంగా తాజాగా విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌ రావును పోలీసులు విచారించడం ప్రాధాన్యత సంచరించుకొంది.

Telangana Phone Tapping Case Updates
Telangana Phone Tapping Case Updates

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 12:01 PM IST

Telangana Phone Tapping Case Updates :రాష్ట్రంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి(ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనతో మొదలై ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చిన కేసు ఇప్పటికే ఎన్నో మలుపులు తిరుగుతూనే ఉంది. తెరపైకి రోజుకో కొత్త పేరు వస్తుండటంతో ఇందులో ఎంత మంది ఉన్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. అయితే పోలీసులే సాక్షులుగా వారి వాంగ్మూలాలే ఆధారాలుగా మారాయి. టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఐబీల్లో పనిచేసిన సిబ్బంది విచారణలో కీలకమైన అంశాలను దర్యాప్తు బృందం రాబట్టింది. మరోవైపు

Police Investigation to Retired SP Divya Charan Rao : ఈ క్రమంలోనే టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో దొంగచాటుగా సొమ్ము తరలింపు అంశం బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును పోలీసులు విచారించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఆ వ్యవహారాలకు సంబంధించి ఆయనను పోలీసులు విచారించారు.

ఎస్సై వాంగ్మూలం ఆధారంగా : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు సూచనలతో టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై ఒకరు రెండుసార్లు రూ.కోటి చొప్పున తీసుకొచ్చి మలక్‌పేట,సికింద్రాబాద్‌ల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో దివ్యచరణ్‌రావుకు అప్పగించినట్లు ఇది వరకు దర్యాప్తులోనే వెల్లడైంది. సదరు ఎస్సై సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని తాజాగా దివ్యచరణ్‌రావును విచారించారు. మూడుసార్లు ఆయన్ను పిలిచి వివరాలు రాబట్టినట్లు తెలిసింది.

సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ - ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా! - Telangana Phone Tapping Case

Task Force EX OSD Radhakishan Rao Case :ఎస్సైని అఫ్జల్‌గంజ్‌, రాణిగంజ్‌లకు పంపి ఎవరి వద్ద నుంచి డబ్బులు తెప్పించుకున్నారు? ఆ తెచ్చిన నగదును మళ్లీ ఎక్కడికి పంపించారు? అందుకు ఆదేశాలిచ్చింది ఎవరు? ఈ వ్యవహారమంతా గతేడాది అక్టోబరులో జరిగినందున అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులకు సమకూర్చారా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అసలు రాధాకిషన్‌రావు ఈ పనికి దివ్యచరణ్‌రావునే ఎందుకు ఎంచుకున్నారనే కోణంలోనూ ఆరా తీసినట్లు తెలిసింది. అయితే ఆయన నుంచి సంతృప్తికర సమాధానాలు రాకపోవడంతో మళ్లీ విచారణకు రావాలని సూచించి పంపించినట్లు సమాచారం.

హవాలా కోణంలో కేసు నమోదుకు అవకాశం : ప్రస్తుతం దర్యాప్తు బృందం దృష్టంతా ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం, ఫోన్‌ ట్యాపింగ్‌పైనే కేంద్రీకృతమైంది. కంప్యూటర్ హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసంతో ప్రత్యామ్నాయాల సేకరణపై అధికారులు ఫోకస్ పెట్టారు. దీంతో నగదు తరలింపు అంశం గురించి అంతగా శ్రద్ధ పెట్టడం లేదని సమాచారం. అయితే అఫ్జల్‌గంజ్‌, రాణిగంజ్‌లలో డబ్బులు సమకూర్చిన వారిని కనిపెట్టడంతోపాటు దివ్యచరణ్‌రావు ఆ సొమ్మును ఎవరికి అప్పగించారని తెలుసుకోవడం కేసులో కీలకాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే హవాలా కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

'రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టారు' - Telangana Phone Tapping Case Update

నా ఫోన్​ ట్యాప్​ చేసి రూ.కోట్లు వసూలు చేశారు - రాధాకిషన్​రావుపై రియల్​ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు - phone tapping case updates

ABOUT THE AUTHOR

...view details