Police Found illegal Ganja Plantation in 15 acres : అల్లూరి జిల్లాలో 15 ఎకరాలలో అక్రమ గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. అది కూడా అటవీ భూమిలో కావటం విశేషం. పెదబయలు మండలం జడిగూడలో సాగు చేస్తున్న గంజాయి పంటను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సూచనలతో రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో ధ్వంసం చేసి తగులబెట్టారు. నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి రవాణా, సాగుపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే సాయంతో ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే వేసుకోవాలని అధికారులు సూచించారు.
డ్రోన్లతో పసిగట్టిన పోలీసులు : కొద్దిరోజుల కిందటే జిల్లాలోని జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయిలో సుమారు 5 ఎకరాలలో గంజాయి సాగును డ్రోన్ సాయంతో గుర్తించి పోలీసులు ధ్వంసం చేశారు. దీనిపై ఎస్పీ అమిత్ బర్దర్ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, గతంలో డ్రోన్ సాయంతో వెతికినా చిన్న చిన్న ముక్కలు కావడం వల్ల కనపడలేదని రెండు అడుగుల పైబడి ప్రస్తుతానికి పెరగడంతో ఇప్పుడు డ్రోన్‌కి కనిపించాయని చెప్పారు. ప్రభుత్వం తరఫున ప్రత్యామ్నాయ మొక్కల కోసం ఈ ప్రాంతంలో పంపిణీ చేశామని అయినా చెడుదారి పడుతున్నారని శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 25 రకాల పంట మొక్కల్ని సాగుచేసుకోవాలని సూచించారు. దాడుల్లో పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులను దారి మళ్లిస్తున్న భయాలివే - కనిపెట్టుకోకుంటే కన్నీళ్లే!