Police Arrested Cyber Criminals in Hyderabad : హైదరాబాద్ నగరానికి వచ్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన నేరగాళ్ల ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. తాజాగా ఈ సైబర్ మోసాగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి వచ్చి పలు వ్యాపారాలు చేస్తున్నట్లు సృష్టించి, నకిలీ ఐడీలతో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాల ద్వారా నిందితులు రూ.10 కోట్లకు పైగా సంపాదించినట్లు గుర్తించారు.
కరెంట్ అకౌంట్ల ద్వారా రాజస్థాన్ జోద్పూర్ కేంద్రంగా భారీగా సైబర్ నేరాలు(Cyber crime) చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. అరెస్టైన వారిని రాజస్థాన్‌కు చెందిన మంగీ లాల్, భజన్ లాల్, కమలేష్ కుమార్, ప్రకాష్ చంద్లుగా పోలీసులు గుర్తించారు. వీరిపై తెలంగాణలో 3 కేసులు, దేశవ్యాప్తంగా మొత్తం 17 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
పెట్టుబడుల పేరుతో భారీ మోసం
మరోవైపు పెట్టుబడులతో భారీ లాభాలు పొందొచ్చని బాధితుడిని మోసం చేసిన నలుగురు సైబర్ నేరగాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు(police) కేసు నమోదు చేశారు. తిరుమలగిరికి చెందిన బాధితుడికి సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్ ద్వారా పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో వల వేశారు. బాధితుడిని ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్ యాప్‌లో జాయిన్ చేసి, మూడు టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. బాధితుడు వారి సూచన మేరకు అలాగే చేశాడు. తర్వాత ఆ యాప్‌లో 3 కంటే ఎక్కువ చేసేటట్లుగా చేశారు.