తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు గుడ్‌న్యూస్ - అకౌంట్లోకి రూ.2 వేలు - స్టేటస్​ ఇలా చెక్​ చేసుకోండి! - PM Kisan 17th Installment

PM Kisan Yojana: కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అన్నదాతలకు గుడ్​న్యూస్​ చెప్పింది. పీఎం కిసాన్ 17వ విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. దీంతో రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. మరి.. డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడుతున్నాయనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 3:46 PM IST

PM Kisan 17th Installment Release Date
PM Kisan 17th Installment Release Date (ETV Bharat)

PM Kisan 17th Installment Release Date: ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు శుభవార్త అందించారు. దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన మోదీ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. తొలి సంతకం ఈ దస్త్రాలపైనే చేశారు. దీంతో ఈ పథకం కింద మొత్తం 9.3 కోట్ల రైతులకు లబ్ధి చేకూరనుంది. మరి ఆ డబ్బులు ఎప్పుడు పడతాయి? స్టేటస్​ ఎలా చెక్​ చేసుకోవాలో చూద్దాం..

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం "ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి" అనే పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్​ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏటా 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను సంవత్సరానికి మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్స్​లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్- జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు రిలీజ్ చేసింది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ..పీఎం కిసాన్​ ఫైల్స్​పైనే సంతకం పెట్టడంతో అతి త్వరలోనే డబ్బులు అకౌంట్లలో జమ కానున్నాయి.

ప్రధాని అయ్యాక మోదీ ఫస్ట్ సంతకం- వారందరి ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు! - Modi First Signature

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

  • పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేయాలి.
  • తర్వాత Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి
  • అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్​ను నమోదు చేసి, క్యాప్చా కోడ్​ను ఫిల్ చేయాలి.
  • ఆ తర్వాత Get Data అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్​ చేసుకోవాలి?

  • ముందుగా మీరు www.pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లోని "Beneficiary List" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.
  • లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి. అంతే సింపుల్​!
  • మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు అక్కడ కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.

రైతులకు శుభవార్త! ఈ స్కీమ్​లో చేరితే నెలకు 3వేల పింఛన్!

Kisan Rin Portal Details and Benefits in Telugu : అన్నదాతకు శుభవార్త.. అప్పుకోసం వడ్డీ వ్యాపారి వద్దకు అవసరం లేదు!

ABOUT THE AUTHOR

...view details