Plight of TIDCO Houses Beneficiaries Under YSRCP Govt:వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల టిడ్కో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో గృహాల్లో దాదాపు పనులు అప్పట్లో పూర్తిచేసింది. ఇంకా మిగిలిన అరకొర పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ పనులు పూర్తిచేసి గృహాలను అప్పగిస్తే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని అక్కసుతో లబ్ధిదారులకు తీవ్రఇబ్బందులకు గురిచేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడంతో టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణంలోని బొమ్మూరులో తొలి విడతలోనే లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందించేందుకు అప్పట్లో యుద్ధప్రాతిపదికన మూడు బ్లాకులు సిద్ధం చేశారు. ఆయా బ్లాకుల్లో టైల్స్, మరుగుదొడ్లు, పైపులైన్లు ఏర్పాటుచేశారు. దాదాపు పనులు పూర్తికావడంతో ఇక ఇళ్లు అప్పగిస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల అప్పగింతలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ ఐదేళ్లలో ఇళ్ల పరిసరాల్లోని సామగ్రి చోరీకి గురైంది. మిగిలిన సామగ్రిని కొందరు ఆకతాయిలు ధ్వంసం చేశారు. రుణాలు కట్టామని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నారని టిడ్కో లబ్ధిదారులు వాపోతున్నారు.
తాగునీటి వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారు - నేడు పట్టిసీమే బంగారమైంది: మంత్రి నిమ్మల - Water Release to Krishna Delta
ఎన్నికల ముందు ఓట్ల కోసం వైఎస్సార్సీపీ నాయకులు హడావుడిగా చేసింది. పూర్తిస్థాయిలో పనులు పూర్తికాకుండానే కొన్ని ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చారు. వాటిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఎక్కువ మంది వాటిలో ఉండేందుకు సుముఖత చూపడంలేదు. కొవ్వూరు, నిడదవోలులోని గృహా సముదాయాల్లో టీడీపీ ప్రభుత్వంలో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా గాలికి వదిలేసింది. అంతర్గత రహదారులు, మురుగుకాలువల పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటి పనులను పూర్తి చేసి తమకు ఇళ్లను అప్పగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఇక మంచి రోజులు వచ్చాయని లబ్దిదారుల్లో ఆశలు చిగురించాయి. ఇళ్ల పంపిణీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల కోసం బ్యాంకుల్లో అప్పులు చేశామని, రుణాలు తీర్చాలని బ్యాంకు అధికారుల నుంచి నోటీసులు వస్తుండడంతో ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఉంటున్న ఇళ్లకు అద్దె చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే తమకు గృహాలు అప్పగించకుండానే బ్యాంకుల నుంచి రుణం చెల్లించాలని ఒత్తిడి వస్తోందని లబ్దిదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్లు పూర్తిచేసి అప్పగిస్తే బాధలు తప్పుతాయని చెబుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ - విజయవాడ యువతి ఆచూకీ లభ్యం - Vijayawada Police on Girl Missing
పర్యాటకులే రాని పులివెందులలో స్టార్ హోటల్ - 12 కోట్లకు జగన్ అనుయాయుడి క్లబ్‌హౌస్ కొనుగోలు - JAGAN STAR HOTEL IN PULIVENDULA