PIL in High Court to Stop Volunteers During Elections:వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకుండా ఓటరు స్లిప్పుల పంపిణీ చేయకుండా నిలువరించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబుబాకర్ సిద్ధికి ఈ పిల్ దాఖలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్ బూత్ ఎజెంట్లుగా వ్యవహరించకుండా అడ్డుకోవాలని కోరారు. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు వ్యవహరించడానికి వీల్లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం, చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరించేలా ఆదేశించాలన్నారు.
అరకొర వేతనాలతో ఎలా బ్రతికేది- నిలదీసిన వందలాది వాలెంటీర్లు! భారీగా తాయిలాలు ఇచ్చి బుజ్జగించిన ఎమ్మెల్యే
సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు నవరత్నాలు, ఇతర ప్రభుత్వ ప్రథకాలను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా అధికారులను ఆదేశించాలన్నారు. వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించినందున స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. సీఎం జగన్, మంత్రి ధర్మాన సహా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులను ప్రతివాదులుగా చేర్చారు.
ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందాలని చూస్తే ఈసీ ఆదేశాలు ధిక్కరించినట్లే: నిమ్మగడ్డ రమేష్‌కుమార్
వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ తెచ్చిన జీవోలు చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. వైసీపీకి చెందిన 2.57లక్షల మంది కార్యకర్తలను వాలంటీర్లుగా రాష్ట్రప్రభుత్వం నియమించడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వ వ్యవస్థలను ధ్వంసం చేసేలా వాలంటీర్ వ్యవస్థను తెచ్చారన్నారు. గౌవర వేతనం ముసుగులో వాలంటీర్ల వ్యవస్థకోసం ప్రభుత్వ ఖాజానా నుంచి ఖర్చుచేసిన సొమ్మును సీఎం జగన్ నుంచి రాబట్టేలా ఆదేశించాలని అభ్యర్థించారు. ప్రజాధనాన్ని వైసీపీ రాజకీయ కార్యకలాపాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు.
జనం సొమ్ము తీసుకుంటూ జగన్ సేవలో గ్రామ వాలంటీర్లు
వైసీపీ నాయకులు తమకు ఓటు వేయకపోతో ప్రభుత్వ పథకాలు దక్కకుండా చేస్తామని వాలంటీర్ల ద్వారా ప్రజలను బెదిరిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా వాలంటీర్లు వైసీపీ విజయం కోసం పనిచేయాలని సీఎం జగన్ ప్రతి రోజూ బహిరంగంగా చెబుతున్నారన్నారు. ఇలాంటి చర్యలకు అనుమతిస్తే నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలు సాధ్యం కావన్నారు. రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అధికార పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను వాలంటీర్లుగా ఎంపిక చేశారన్నారు. ఇలా ఎంపిక చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు.
వాలంటీర్లకు సర్వీసు నిబంధనలు లేవు, నియమావళి లేదని ఈ నేపథ్యంలో వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పటీషనర్ పేర్కొన్నారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులిచ్చిందన్నారు. ప్రభుత్వ ఖజానాను రాజకీయ అవసరాల కోసం సీఎం జగన్ లూటీ చేస్తున్నారని ఇలాంటి చర్యలకు అనుమతిస్తే నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలు సాధ్యం కావన్నారు పిటిషనర్ పేర్కొన్నారు.