ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పిపోయిన కుక్క కోసం కరపత్రాలు - వారం తర్వాత సేఫ్​గా ఇంటికి

కుక్క ఆచూకీ కోసం యజమాని వినూత్న ప్రయత్నం - కాపాడి ఇంటికి చేర్చిన ఆటో డ్రైవర్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Guntur Missing Pet Dog Case
Guntur Missing Pet Dog Case (ETV Bharat)

Guntur Missing Pet Dog Case :పెంపుడు జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా చాలా మంది శునకాలను అమితంగా ఇష్టపడుతుంటారు. అలా ప్రేమగా చూసుకునే ఓ పెంపుడు కుక్క తప్పిపోవడంతో ఆ కుటుంబంసభ్యులు ఆందోళన చెందారు. గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో నివాసం ఉండే మోజెస్ అనే వ్యక్తి కుటుంబం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకాన్ని రెండేళ్లుగా పెంచుకుంటున్నారు. దానికి మ్యాక్స్ అని పేరు కూడా పెట్టుకున్నారు.

రెండు గంటల్లోనే ఫలించిన ఫలితం : ఈ నెల 10వ తేదీ నుంచి మ్యాక్స్ కనిపించలేదు. రెండు రోజుల పాటు దాని కోసం గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో అరండల్​పేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఫలితం కనిపించకపోవడంతో స్థానిక కేబుల్​ టీవీలో ప్రకటన ఇచ్చారు. నగరంలో ప్లెక్సీలు వేయించారు. అయినా శునకం జాడ దొరకలేదు. దీంతో వినూత్నంగా ఆలోచించి కరపత్రాలు ముద్రించారు. కుక్క ఫొటోతో పాటు ఎప్పుడు తప్పిపోయింది, దాని వయస్సు, ఆనవాళ్లు తదితర వివరాలన్నీ పాంప్లెట్​లో పొందుపరిచారు. ఈ కరపత్రాలను అన్ని పత్రికల్లో ఉంచి ఇంటింటికి వెళ్లేలా చేశారు. కరపత్రంలో ఫోన్ నంబర్​తో పాటు ఆచూకీ చెప్పిన వారికి పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఇలా కరపత్రాలు పంచిన రెండు గంటల్లోనే ఫలితం కనిపించింది.

స్వర్ణభారతినగర్​కు చెందిన ఆటోడ్రైవర్ జయరాజ్‌ ఫోన్ చేసి మ్యాక్స్ తనవద్దే ఉందని యజమానికి చెప్పాడు. వారం రోజుల క్రితం వర్షం పడుతుండగా మ్యాక్స్ ఇంటి నుంచి వెళ్లిపోగా అదే రోజు లక్ష్మీపురంలో ఆటోడ్రైవర్​కు కనిపించింది. వీధికుక్కలు ఆ శునకం వెంటపడటం చూసిన ఆటోడ్రైవర్ దాన్ని కాపాడి తన ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు. వారం రోజులుగా దానికి కావాల్సిన ఆహారం అందించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు. కరపత్రం చూసిన వెంటనే యజమానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చానని ఆటోడ్రైవర్‌ తెలిపారు. పెంపుడు కుక్కను చూసిన తర్వాత యజమాని కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

"ఈ నెల 10వ తేదీన మా కుక్క తప్పిపోయింది. అప్పటి నుంచి ఎంత గాలించినా ఫలితం దక్కలేదు. కుక్క కోసం తిరుగుతూనే ఉన్నాను. ఇందులో భాగంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కరపత్రాలు వేయించాం. కుక్క తన వద్ద ఉందని ఓ ఆటోడ్రైవర్​ ఫోన్ చేసి చెప్పాడు​. వెంటనే అక్కడికి చేరుకుని మా కుక్కను తీసుకున్నాం. మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది." -యజమాని

ప్రపంచంలో అత్యంత కాలం జీవించిన కుక్క- 'బ్లూయ్' లైఫ్​ స్పాన్ తెలిస్తే షాకే! - World Longest Lived Dog

తొలిసారి కుక్కను పెంచుతున్నారా? - ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే! - Pet Care Tips For Beginners

ABOUT THE AUTHOR

...view details