Betting APP Gang Arrest in Visakha : కాయ్ రాజా కాయ్ - వంద పెట్టండి వెయ్యి గెలుచుకోండి. ఒకప్పుడు ఎక్కడో సందుగొందుల్లో గుట్టుగా సాగిపోయే ఈ బెట్టింగ్ వ్యవహారం. ఇప్పుడు పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారానే కాకుండా మొబైల్ యాప్‌ల రూపంలోనూ వచ్చేసింది. ఇందులో చిక్కుకొని అమాయకులు విలవిల్లాడుతున్నారు. ఆన్‌లైన్‌లో తారసపడుతున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి.
పందేల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటుంటే నష్టపోయిన మరికొందరు మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఈ తరహా మోసాలు కలవర పెడుతున్నాయి. వీటిపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నా పుట్టగొడుగుల్లా ఎక్కడోచోట పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇందుకు సంబంధించి వివరాలను సీపీ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. వీరికి చైనాతో సంబంధాలున్నాయని చెప్పారు. రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నారని శంఖబ్రత బాగ్చీ వివరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆర్‌బీఐ అనుమతి లేకుండా ఈ ముఠా యాప్ నిర్వహిస్తోందని శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ సొమ్మును చైనా, తైవాన్‌కు పంపుతున్నట్టు ద్యర్యాప్తులో గుర్తించామని అన్నారు. నిందితుల నుంచి 8 డెస్క్‌టాప్‌లు, 10 ల్యాప్‌టాప్‌లు, కారు, బైక్, 800 చెక్‌బుక్‌లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు వీరు ఏ విధమైన చిరునామాలు లేకుండా సిమ్‌కార్డులు సంపాదించి వాటి ద్వారా ఈ నేరానికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఇటువంటి యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంఖబ్రత బాగ్చీ సూచించారు.
"నిందితులకు చైనాతో సంబంధాలున్నాయి. రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండా బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ యాప్ సొమ్మును చైనా, తైవాన్‌కు పంపుతున్నారు. నిందితుల నుంచి 10 ల్యాప్‌టాప్‌లు, 8 డెస్క్‌టాప్‌లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నాం. 800 ఖాతాలు, చెక్‌బుక్‌లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నాం." - శంఖబ్రత బాగ్చీ విశాఖ సీపీ
138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై నిషేధం.. కేంద్రం కీలక నిర్ణయం
Cricket Betting Case: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.10 లక్షల నగదు స్వాధీనం