Chandrababu on Investments in AP : పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారవర్గాలకు పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయన రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. రాష్ట్రం ఇప్పుడు సరికొత్త, అత్యుత్తమ విధానాలతో ఆహ్వానం పలుకుతోందని తెలిపారు. ఏపీ ఇప్పుడు పూర్తిగా వ్యాపార అనుకూలమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావంతులైన యువత, అద్భుత మౌలిక సదుపాయాలు, సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు వివరించారు.
పరిశ్రమ అనుభవజ్ఞులతో సమగ్ర సంప్రదింపుల తర్వాత కొత్త పాలసీ ఫ్రేమ్ వర్క్ రూపొందించినట్లు చంద్రబాబు వెల్లడించారు. వ్యవస్థాపక స్ఫూర్తిని, వ్యాపారాలను పెంపొందించడమే లక్ష్యంగా పాలసీ ఫ్రేమ్ వర్క్ జరిగిందని చెప్పారు. దేశంలో అత్యుత్తమ వ్యాపార అనుకూల వ్యవస్థను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. పారిశ్రామిక పునాదిని ఏర్పరచుకుని అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Respected Industrialists & Investors,
— N Chandrababu Naidu (@ncbn) October 17, 2024
Andhra Pradesh is now OPEN with new best policies.
I'm inviting you to invest in our state, where we have rolled out a red carpet to welcome you. In AP, a business-friendly state government, talented youngsters and robust infrastructure… pic.twitter.com/ODHf1dFokh
ఇంతకంటే మంచి సమయం లేదు : భారతదేశంలో మరీ ముఖ్యంగా ఏపీలో పెట్టుబడులకు ఇంతకంటే మంచి సమయం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఉత్తేజకర వృద్ధి ప్రయాణంలో తమతో కలసిరావాలని ఆయన కోరారు. వ్యాపార పరిధులు, తమ రాష్ట్ర సామర్థ్యాన్ని పరస్పరం విస్తరించుకునే అవకాశం ఇదేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన పెట్టుబడులు చూసేందుకు ఎదురుచూస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
Six Key Policies in AP : మరోవైపు రాష్ట్రాభివృద్ధి దిశగా ఏపీ సర్కార్ అత్యంత కీలకమైన అడుగులు వేసింది. ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడేలా ప్రధానమైన ఆరు పాలసీలను ప్రకటించింది. ఎంత పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదని ఎన్ని ఉద్యోగాలు, ఎంత ఉపాధి కల్పించారనేదే ప్రాధాన్యంగా జాబ్ ఫస్ట్ అనే నినాదంతో ఈ కీలక పాలసీలను రూపొందించింది.
ఏపీలో 2030 నాటికి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయటమే లక్ష్యంగా వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ (ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త) నినాదంతో ఎంఎస్‌ఎంఈలు, ఎంటర్‌ప్రెన్యూర్‌ల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ పాలసీలను ఆమోదించింది. ఈ ఆరు పాలసీలు రాష్ట్ర, యువత భవిష్యత్లో పెనుమార్పులు తీసుకొస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఏపీ ప్రగతినే మార్చేస్తాయని వివరించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీలను తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
'వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్' నినాదంతో ముందుకు : సీఎం చంద్రబాబు
'ఎంప్లాయిమెంట్ ఫస్ట్' ప్రభుత్వ విధానం - పెట్టుబడులు వచ్చేలా పాలసీలు: సీఎం చంద్రబాబు