ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్నాడు జిల్లాలో కలుషిత నీటి కలకలం - 20 మందికి అస్వస్థత - contaminated water in palnadu

People Fell Ill After Drinking Contaminated Water: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లిలో కలుషిత నీరు కలకలం సృష్టిస్తోంది. పంచాయతీ ఏర్పాటు చేసిన బోర్‌ వాటర్‌ తాగి సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజుల నుంచి నీటిలో పురుగులు వస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మురుగునీరు కాలువల పక్కన బోర్‌ పైపులైన్లు ఏర్పాటు చేయడం వల్లే నీరు మురికిగా వస్తున్నాయని తెలిపారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 1:56 PM IST

People Fell Ill After Drinking Contaminated Water
People Fell Ill After Drinking Contaminated Water (ETV Bharat)

People Fell Ill After Drinking Contaminated Water: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో తాగునీరు కలుషితం కావటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. కేసానుపల్లిలోని ఎస్సీ కాలనీలో ప్రజలు తాగునీరు కోసం గ్రామంలో ఏర్పాటు చేశారు. ఆ బోర్ వాటర్ తాగిన ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. బోర్ వాటర్ పూర్తిగా కలుషితం అవ్వటంతో, ఆ నీటిని తాగి అనారోగ్య బారిన పడ్డారు.

కలుషిత నీరు తాగి ఇప్పటికే సుమారు 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో గ్రామంలోని చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, కలుషిత నీరు తాగి గత మూడు రోజుల నుంచి గ్రామంలోని ప్రజలు అనారోగ్య పాలుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మురుగునీరు కాలువల పక్కనే బోర్‌ ఏర్పాటు చేయడం వల్లే తాము అస్వస్థతకు గురవుతున్నామని బాధితులు వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం, అధికారులు స్పందించి కలుషిత నీరు కాకుండా మంచినీటిని ప్రజలకు అందించి ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

"మురికి కాలువ, బోర్ ఒకే దగ్గర ఉన్నాయి. దీనివలన వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వాటర్​లో పురుగులు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి". - బాధితులు

తుంబిగనూరులో తప్పిన ముప్పు - తాగునీటి శుద్ధజల ట్యాంకులో పురుగులమందు - Poison on drinking water

ABOUT THE AUTHOR

...view details