People Facing Problems with Damaged Roads: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో రోడ్లు అత్యంత దారుణంగా మారాయి. నగరంలో వాహనదారులు రోడ్లపైకి రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఒంగోలులోని కర్నూల్ రోడ్ ఫ్లై ఓవర్ వద్ద ఉన్న సర్వీస్ రోడ్‌పై ప్రయాణిస్తుంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ సర్వీస్ రోడ్డులో హైటెన్షన్ లైన్ల భూగర్భ కేబుల్ నిర్మాణ పనులు కోసం గుంతలు తీసి కేబుల్ పనులు ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుంచి పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. దీంతో వాహనదారుల పాట్లు మరింత దయనీయంగా మారింది.
అధ్వానంగా ఒంగోలు రహదారులు - పట్టించుకోండి మహాప్రభో! అధ్వానంగా ఏలూరు - కైకలూరు ప్రధాన రహదారి
ఈ సమీపంలో మరోచోట కూడా ఇలానే తవ్వి పైపై నే మట్టితో కూర్చి వదిలేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఏబీఏం కళాశాల మైదానానికి వ్యాహ్యాళికి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు కూడలి నుంచి జిల్లా జైలుకు వెళ్లే మార్గంలో పరిస్థితి ఇలాగే ఉంది. కాలేజీ ఎదుట రోడ్డులో పైపు లైన్ లీకేజ్ అవ్వడంతో అక్కడ రెండు చోట్ల పైపు లైన్ల లీకేజీ మరమ్మత్తుల కోసం రోడ్డుని తొవ్వారు. పనులు పూర్తయ్యాక కూడా పైపైనే మట్టి కప్పి వదిలేశారు. ఈ రహదారి నిత్యం వాహనాలు రద్దీగా ఉండే రోడ్డు కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అడుగుకో గుంత, గజానికో గొయ్యి - ఈ రహ'దారుణాల' సంగతేంటి?: టీడీపీ, జనసేన ఆందోళన
పగటివేళ పరవాలేదు అనుకున్నా రాత్రి సమయంలో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని నానావస్థలు పడుతున్నారు. అధ్వానంగా తయారైన రహదారుల కారణంగా తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రహదారుల పరిస్థితిని పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్లను తవ్వేసిందని, చేసే పనులు పూర్తి చేయకుండా గాలికొదిలేసిందని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
"ఒంగోలు నగరంలో రోడ్లు అంత్యంత దారుణంగా మారాయి. రోడ్లపైకి రావాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న సర్వీస్ రోడ్డులో భూగర్భ కేబుల్ నిర్మాణ పనులు కోసం గుంతలు తవ్వి అలానే ఉంచేశారు. దీంతో తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలో ప్రధాన కూడళ్ల వద్ద ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రభుత్వం స్పందించి రోడ్ల మరమ్మతులు చేయాలని కోరుతున్నాం."- స్థానికులు
'అక్కడి వరకే బాగు' ఇక్కడంతా అధ్వానం - 'రోడ్డు'నపడ్డ రాష్ట్రం పరువు