ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉచిత ఇసుక అమలుతో కార్మికుల్లో ఆనందం - చంద్రబాబు, పవన్‌ కల్యాణ్​ చిత్రపటాలకు క్షీరాభిషేకం - People Enjoy About Free Sand Policy - PEOPLE ENJOY ABOUT FREE SAND POLICY

People Are Happy About Free Sand Policy in AP: ఉచిత ఇసుక విధానం అమలులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు, కూటమి నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇసుకను అక్రమంగా దోచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిందని కార్మికులు ఆరోపించారు. వైఎస్సార్సీపీ కార్మికుల కడుపు కొడితే కూటమి ప్రభుత్వం కడుపు నింపుతుందన్నారు.

People Are Happy About Free Sand Policy in AP
People Are Happy About Free Sand Policy in AP (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 8:12 PM IST

People Are Happy About Free Sand Policy in AP: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి అమలవుతున్న నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగ ప్రతినిధులు, కూటమి శ్రేణులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇసుకను అక్రమంగా దోచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిందని కూటమి నేతలు, కార్మికులు ఆరోపించారు. నూతన ఇసుక విధానంతో కార్మికులకు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలి నుంచి అరసవల్లి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇసుకను వ్యాపారంగా మార్చి దోచుకుంటే చంద్రబాబు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టారని కార్మికులు కొనియాడారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంపై చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో నేతలు, భవన నిర్మాణ కార్మికులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

శ్రీకాకుళంలో భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ - పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వడంపై హర్షం

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో భవన నిర్మాణ కార్మికులు కడుపు కొడితే కూటమి ప్రభుత్వం కడుపు నింపే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ పురందేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలసి మంత్రి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక పంపిణీ హామీని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కుటాగుళ్ల వద్ద ఆయన ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించారు.

ఉచిత ఇసుక ప్రారంభం - రూ.6 వేల ట్రాక్టర్ ఇప్పుడు రూ.1500 - Free sand policy begins from today

జగన్ పాలనలో ఇసుక విధానం పేరిట వేల కోట్ల దోపిడీ జరిగిందని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని అదే సమయంలో తప్పు చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఉచిత ఇసుక అమలుతో తమ ఉపాధికి ఢోకా ఉండదని భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కార్మికులకు మిఠాయిలు పంచారు. ఉచిత ఇసుక విధానంపై నిర్మాణ రంగ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఉచిత ఇసుక కావాలా ? అయితే ఇలా చేయండి ! - HOW TO GET FREE SAND

ABOUT THE AUTHOR

...view details