ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్నహోబిళంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు - ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు - Uravakonda Lakshmi Narasimha Swamy

Pennahobilam Lakshmi Narasimha Swamy: అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఏపీ నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అదే విధంగా లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల సౌకర్యం లేక అసహనానికి గురవుతున్నారు. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఆలయానికి వచ్చే భక్తులకు తగిన సదుపాయాలు లేక అవస్థలతో దర్శనం చేసుకోవాల్సి వస్తోంది.

Pennahobilam Lakshmi Narasimha Swamy
Pennahobilam Lakshmi Narasimha Swamy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 7:02 PM IST

Pennahobilam Lakshmi Narasimha Swamy: అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరవకొండలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. 20న సాయంత్రం స్వామి ఉత్సవ విగ్రహాలు ఆమిద్యాల నుంచి పెన్నహోబిలం ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం..సింహగిరిపై దేదిప్య కాంతులు

21న ప్రాకారోత్సవం, 22న చంద్రప్రభ వాహన సేవ, 23న గో, శేష వాహన సేవ, 24న హంస వాహనం, 25న హనుమద్‌ వాహనం, 26న గరుడ వాహనం, శ్రీవారి కల్యాణోత్సవం, 27న ఐరావత వాహనం, 28న ఉదయం మడుగుతేరు, సాయంత్రం బ్రహ్మ రథోత్సవం, 29న అశ్వ వాహనసేవ, 30న ధ్వజారోహణం, శయనోత్సవం, 31న ఉత్సవ విగ్రహాలు ఆమిద్యాలకు వెళ్లడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

భక్తుల సౌకర్యార్థం కోసం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్లు ఆలయ ఈవో విజయ్‌కుమార్‌ తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా తాగునీరు, వసతి, భోజన సదుపాయం కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయ ఉత్తర ద్వారం ముందు చలువ పందిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

అంతర్వేదిలో వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవం

లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం అణువణువునా కనపడుతుంది. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఆలయానికి వేలాది మంది వచ్చే భక్తులకు తగిన సదుపాయాలు లేక అవస్థలతో దర్శనం చేసుకోవాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక భక్తులు సాధారణ రోజుల్లో 500- 1000 వరకు, శని, ఆదివారం, సెలవులు, పర్వదినాల్లో 10వేల మంది వరకు వచ్చి దర్శించుకుంటారు. బయట నుంచే భక్తులకు కల్పించాల్సిన వసతులపై నిర్లక్ష్యం, నిర్వహణపై ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్, స్నానాల గదులు లేకపోవడం, ఎండలో ఆలయం చుట్టూ తిరిగేలా తివాచీలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో జలకళ, నేడు వెలవెల - బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో అడుగంటిన కోనేరులు! - Bugga Rameswara Temple

పెన్నహోబిళంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - ఇతర రాష్ట్రాల నుంచి తరలిరానున్న భక్తులు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details