Deputy CM Pawan Kalyan Speech in Assembly:వరుస దోపిడీలు, అరాచకాలే వైఎస్సార్సీపీ సర్కారు నుంచి కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సమర్థ నాయుకుడు సీఎం చంద్రబాబు అని కితాబిచ్చారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల ప్రగతిపై శాసనసభలో జరిగిన చర్చలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. చంద్రబాబు సమర్థ నాయకత్వంలో రాష్ట్రం త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
డొక్కా సీతమ్మ పేరు పెట్టటం అభినందనీయం: గత ప్రభుత్వంలో జగన్ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆస్తుల పత్రాలపై బొమ్మలు పెట్టుకున్నారని పవన్ విమర్శించారు. విద్యార్ధుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టటం అభినందనీయమని తెలిపారు. సామాజిక మాధ్యమాల విషయంలో అసభ్యకరమైన పోస్టుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించారని అన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులమని చెప్పుకునే గూండాలకు గట్టి హెచ్చరిక చేసిన సీఎం, హోం మంత్రికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఇసుక, బెల్డు దుకాణాలు ఇతర అంశాలపై సీఎం ఆశయాలను నెరవేర్చేలా మంత్రులంతా పనిచేస్తామని హామీ ఇస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు.
మిస్సింగ్ మహిళల ఆచూకీ గుర్తించిన పోలీసులు - అభినందించిన పవన్ కల్యాణ్