Patient Commits Suicide After Being Scolded by Nurse :మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో రోగి ఆత్మహత్య కలకలం రేపింది. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన మహిళ, ఉదయం ఆత్మహత్య చేసుకోవడంతో, నర్సులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా పరిధిలో దామరగిద్ద మండలం కందన్ పల్లి గ్రామానికి చెందిన నారమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆసుపత్రిలో చూపించినా తగ్గలేదు. దీంతో జిల్లా జనరల్ ఆసుపత్రికి వెళ్లారు.
సోమవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. మంగళవారం ఉదయం లేచి బాగానే ఉన్న నారమ్మ కాసేపటి తర్వాత బాత్రుమ్ వెళ్లి వస్తానని మేనల్లుడితో చెప్పి వెళ్లింది. వెళ్లి అరగంట దాటినా తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన నరేశ్ ఆసుపత్రిలో వెతికాడు. పక్కవార్డులో అడిగితే బాత్‌రూమ్‌లోకి వెళ్లి చాలాసేపు అయింది కానీ బయటికి మాత్రం రావడం లేదు అని చెప్పారు.
బాలిక ప్రాణం తీసిన కుట్టుమిషన్ సూది! - ఘట్కేసర్లో విషాదం
దీంతో కంగారు పడ్డ నరేశ్ బాత్‌రూమ్ డోర్ తెరిచి చూసేసరికి ఉరేసుకుని కనిపించింది. హుటాహుటిన ఆమెని కిందకి దించి పరిశీలించగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్య సేవలు అందించే క్రమంలో రాత్రి డ్యూటీలో ఉన్న నర్సులు నారమ్మను దుర్భాషలాడారని, ఆ అవమానం భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 2వ పట్టణ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు.
"అత్తకు హై ఫీవర్. ఇక్కడ మంచిగా చూస్తారు అని నారాణయపేట నుంచి మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చాం. రాత్రి చికిత్స చేశారు. డాక్టర్లు చెక్ చేశాక పొద్దున ఇంటికి వెళ్దామని కూడా అత్త అన్నది. పొద్దున లేచి నేను బాత్‌రూం పోయి వస్తా నువ్వు ఇక్కడే ఉండు అంటే అక్కడే ఉన్నాను. చాలా సేపటికి రాలేదు. వెళ్లి చూసేసరికి ఉరేసుకుని ఉంది. డాక్టర్లు చూసి చనిపోయింది అని చెప్పారు." - నరేశ్, నారమ్మ మేనల్లుడు
ఆ గ్రామానికేమైంది - ఆరు నెలల్లో 13 మంది ఆత్మహత్య!
తండ్రి వాట్సాప్‌కు లొకేషన్ - ప్రేమ జంట సజీవదహనం కేసులో ట్విస్ట్!