NBK Thanks To All Fans And Well Wishers: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో నందమూరి బాలకృష్ణకు నన అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బాలకృష్ణకు పద్మవిభూషణ్ రావడంపై రాజకీయ, సినీ ప్రముఖులు నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి. తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా భారత ప్రభుత్వానికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ఆయన ధన్యవాదాలను తెలియజేశారు.
అందరికీ నా ధన్యవాదాలు:నందమూరి బాలకృష్ణ: తన ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు నుంచి ఆయన వారసుడిగా నేటి వరకు తన వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న తన అభిమానులకు, తనపై విశేష ఆదరాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా తన తోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ సైతం అభినందనలు చెప్పారు.
నిమ్మకూరులో బాలయ్య చిత్రపటానికి పాలాభిషేకం:బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో కృష్ణా జిల్లా నిమ్మకూరులో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాలకృష్ణ చిత్రపటానికి పామర్రు శాసనసభ్యులు వర్ర కుమార్ రాజా పాలాభిషేకం చేశారు. గ్రామస్తులు మిఠాయిలు పంచుకున్నారు. బాలకృష్ణకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఈ గౌరవం దక్కడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. సినీ రాజకీయ రంగాల్లోనే కాకుండా క్యాన్సర్ హాస్పటల్ ద్వారా సేవలు అందిస్తున్న బాలకృష్ణకు అవార్డు రావడం ఎంతో అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.
హిందూపురంలో అభిమానుల సంబరాలు: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వచ్చిన శుభ సందర్భంగా బాణసంచా పేల్చి మిఠాయిలను పంపిణీ చేశారు. అదే విధంగా ఐదు సింహాల కూడలిలో బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన శుభ సందర్భంలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.