Padma Shri Awardee Kanakaraju Passed Away :గిరిజనుల సంప్రదాయ గుస్సాడీ నృత్యానికి జీవం పోసి, భావితరాలకు అందిస్తున్న పద్మశ్రీ కనకరాజు కన్నుమూశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయికి చెందిన కనకరాజు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులు వివిధ ఆసుపత్రుల్లో చూయించారు. వారం రోజుల నుంచి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి వద్దే మృతిచెందారు.
సీఎం సంతాపం : పద్మ శ్రీ గ్రహీత కనకరాజు మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. కనకరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో కనకరాజు అంత్యక్రియలు జరపాలని సీఎం ఆదేశించారు. అంత్యక్రియల కోసం ఉత్తర్వులు జారీ చేశారు.
Kanaka Raju: పద్మశ్రీ కనకరాజు దీనస్థితిపై స్పందించిన కలెక్టర్ రాహుల్ రాజ్
2021లో పద్మశ్రీ : నేడు కనకరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గుస్సాడీకి కనకరాజు చేస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2021 నవంబరు 9న ఆయనకు పద్మశ్రీ ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా కనకరాజుకు అవార్డు ప్రదానం చేసింది. గిరిజన పోరాటయోధుడు కుమురంభీం వీరమరణం పొందిన తర్వాత గిరిజనుల స్థితిగతులు, పడుతున్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రసిద్ధ ఆంత్రోపాలజిస్టు హేమన్‌డార్ఫ్‌ను అప్పటి నిజాం ప్రభువు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పంపించారు. ఆదివాసీలతో మమేకమై వారి జీవన విధానం, ఒనగూరాల్సిన మౌలిక సౌకర్యాలపై అధ్యయనం చేశారు.
కుటుంబ నేపథ్యం :కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుట్టపై ఉన్న గిరి పల్లె మార్లవాయి కనకరాజు జన్మస్థలం. పేద రైతు దంపతుల రాము, రాజుభాయిల ఏకైక కుమారుడు ఆయన. 80 ఏళ్ల వయసున్న రాజుకు ఆ రోజుల్లో విద్యావకాశాలు లేవు. ఓ మాస్టారు దగ్గర మరాఠీ అక్షరాలు మాత్రమే నేర్చుకున్నారు. తండ్రితో వ్యవసాయ పనులకు వెళ్లేవారు. రాజుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య పార్వతీబాయి ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు చిన్న భార్య భీమ్ భాయికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. కుమారులంతా వ్యవసాయం చేస్తున్నారు. గుస్సాడీ నృత్యమే ఆలంబనగా కనకరాజు పెరిగారు.
Gussadi Kanakaraju: గిరి 'పద్మం' గుస్సాడి కనకరాజుకు ఘన స్వాగతం..
అంపశయ్యపై కనకరాజు: ఇందిరాగాంధీతో నృత్యం చేసిన 'పద్మశ్రీ'కి పలకరింపే కరవైంది!