Middle class people own house dream remaining as Dream :సామాన్య ప్రజలు కొనుగోలు చేసే ధరల్లో ఇళ్ల నిర్మాణాలు తగ్గిపోవడంతో ఆయా వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు పేదవారి కోసం వివిధ పథకాల కింద గృహ నిర్మాణం చేపడుతున్నాయి. సంపన్నులు ప్రీమియం ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ మధ్యలో వర్గాలు మాత్రం ఇల్లు కొనలేక సతమతమవుతున్నాయి. కేంద్రం ఇంతకముందే ప్రవేశపెట్టిన పీఎంఏవై గృహరుణ ఆధారిత వడ్డీ సబ్సిడీతో కొనుగోలుదారులకు భారం తగ్గి ఈఎంఐ చెల్లింపుల్లో కొంత వెసులుబాటు లభించేది. ఈ పథకం ఎంఐజీ విభాగంలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణం చేసినప్పుడు ఎక్కువగా ప్రయోజనం పొందారు. ఇప్పుడు ఇది ఎల్‌ఐజీ వరకే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో పథకాన్ని విసరిస్తే మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చాలా కాలంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో హౌసింగ్ బోర్డుల ఆధ్వర్వంలో ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని కాలనీలను నిర్మించేవారు. అధిక, మధ్య తక్కువ అదాయ వర్గాలుగా హెచ్‌ఐజీ, ఎంఐజీ, ఎల్‌ఐజీగా విభజించి ఇళ్లను, స్థలాలను విక్రయించేవారు. అవసరమైతే ఆయా వర్గాల్లోనూ ఒకటి రెండుగా విభజన చేసి అందరినీ సొంతింటిని చేరువ చేసేవారు.
ఈ క్రమంలో డిమాండ్‌కు తగ్గట్లుగా కొనుగోలుదారుల అవసరాలకు అనుకూలంగా నిర్మాణాలు చేయడంతో హౌసింగ్ బోర్డులు వెనుకబడి ప్రైవేట్ రంగం విజృంభించింది. మొదట్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న ఇళ్ల నిర్మాణం చేపట్టినా ఆ తర్వాత డిమాండ్ ఉన్న ప్రీమియం ఇళ్లవైపు రియల్ ఎస్టేట్ మొగ్గింది. భూముల ధరలు కూడా పెరగడంతో సరసమైన ధరల ప్రాజెక్టులు చేపట్టలేకపోతున్నామని బిల్డర్లు అంటున్నారు. విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం చేపడితే విక్రయాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. భూముల ధరల పెరుగుదలతో చదరపు అడుగు ధర ఆ మేరకు పెరుగుతోందని అంటున్నారు.
ఎందుకని కొనలేకపోతున్నారు ?