ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భయపెడుతున్న ఉల్లి ధరలు - కొనడానికి జంకుతున్న సామాన్యులు - Increase Onion Prices in AP - INCREASE ONION PRICES IN AP

Onion Prices Increased Drastically in AP: వంటింటి సరుకులు సామాన్యుల పాలిట భారంగా మారుతున్నాయి. పెరిగిన ధరలతో కొన్నింటిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ జాబితాలో ఉల్లిపాయ కూడా చేరింది. ఉల్లిపాయ లేని వంటింటిని ఊహించలేం. కూర వండాలన్నా, పోపు వేయాలన్నా అది తప్పనిసరి. సాధారణంగా ఉల్లిపాయల్ని కోస్తుంటే కన్నీళ్లు వస్తుంటాయి. అటువంటిది ఇప్పుడు అవి కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్​లో ఉల్లి ధర అర్ధ సెంచరీ దాటేసింది. దాంతో రోజురోజుకు ధర పెరుగుతుండటంతో సామాన్యులు ఉల్లి వాడకాన్ని తగ్గించుకుంటున్నారు.

Onion Prices Increased
Onion Prices Increased (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 10:16 PM IST

Onion Prices Increased Drastically in AP:ఉల్లి లేకుండా ఏ కూర రుచికరంగా ఉండదు. అవి లేకుండా కూరలు వండాలంటే ఎవరూ ఇష్టపడరు. ప్రస్తుతం వాటి ధర ఆకాశాన్ని తాకుతున్నాయి. 3 నెలల క్రితం కిలో 20 రూపాయలు పలికిన ధర నేడు మూడింతలు పెరిగింది. కిలో ఉల్లి 60 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. వరుసగా పండుగలు, శుభకార్యాలు ఉండడంతో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు వీటిని కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది.

డిమాండ్​కు అణుగుణంగా లభ్యత లేకపోవడం, భారీ వర్షాల వల్ల ఉల్లి సాగు తగ్గి దిగుబడి పడిపోయింది. వ్యాపారస్థులు ఉల్లి నాణ్యతను బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు. హోల్ సేల్లో లావుగా ఉన్న కిలో ఉల్లికు 55 రూపాయలు, ఓ మోస్తరు ఉన్న దానికి కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో ధరలు ఓ మోస్తరుగా ఉన్నా రిటైల్ మార్కెట్లలో మాత్రం అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుబడి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులతోపాటు డిమాండ్ ఏర్పడటంతో ఉల్లికి ధర పెరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో ఉల్లి పంట సాగు ఎక్కడా చేపట్టరు. జిల్లాలోని హోల్​సేల్​ వ్యాపారులు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.

భయపెడుతోన్న ఉల్లి ధరలు - కొనడానికి భయపడుతోన్న సామాన్యులు (ETV Bharat)

"లడ్డూ అంటే ఇది" - ఊపిరి పీల్చుకుంటున్న శ్రీవారి భక్తులు - "ఆనంద నిలయం"లో హర్షాతిరేకాలు - TIRUMALA LADDU QUALITY

ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటకలో పంట సాగు తగ్గడంతోపాటు, వరదల కారణంగా ధరలపై ప్రభావం చూపుతోంది. దీంతో జిల్లాలోని హోల్​సేల్​ వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి రవాణా, ఇతర ఖర్చులు అధికమవుతున్నాయి. సాధారణంగా కిలో రూ.20 నుంచి రూ.25 లోపు ధర ఉండే నాణ్యమైన కిలో ఉల్లిపాయలు రిటైల్ మార్కెట్​లో రూ.55 నుంచి రూ.60 వరకు అమ్ముతున్నారని కొనుగోలుదారులు చేబుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటడంతో కొనలేని పరిస్థితి నెలకొందని సామాన్యులు పెదవి విరిస్తున్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలకు మహారాష్ట్ర మార్కెట్ మాత్రమే కీలకం. ఆ రాష్ట్రంలోని షోలాపూర్, నాసిక్ ఉల్లిగడ్డలకు పెట్టింది పేరు. అధిక శాతం సరుకు అక్కడి నుంచి విజయవాడకు దిగుమతి అవుతుంది. తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక నుంచి ఉల్లిపాయలు ఓ మోస్తరుగా వస్తుంటాయి. మరోవైపు మన రాష్ట్రంలో ఉల్లిగడ్డలు పండించే కర్నూలు పంట జాప్యమైంది. వర్షాలు పడటం, ఇంకా పంట చేతికి రావడానికి సమయం ఉందని దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే సరకు పైనే ఆధారపడాల్సి ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కేవలం వర్షాలు, వరదలు వల్లే ధర పెరిగిందని, రాబోయే రోజుల్లో, తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

తిరుమల లడ్డూ వివాదం - వైరల్​ అవుతున్న ప్రకాష్​రాజ్​ వరుస పోస్టులు - Prakash Raj vs Pawan Kalyan

పట్టు విడవని ముగ్గురు మిత్రులు - ఏడాదికి 70 లక్షల బిజినెస్​ - KUSALA HONEY FARMING

ABOUT THE AUTHOR

...view details