Students Missing at Seshachalam Forest :సరదాగా గడిపేందుకు ఎంతో హుషారుగా శేషాచలం వెళ్లిన ఆ విద్యార్థులకు అనుకోని సంఘటన ఎదురైంది. జీవితంలో ఎప్పుడూ చూడని కఠిన సవాల్ ఎదుర్కొవాల్సి వచ్చింది. విషాదయాత్ర కాస్త విషాదాంతంగా ముగిసింది. వాటర్ ఫాల్స్ చూడాలన్న సరదా వారిని చివరికి అడవిపాలు చేసింది. ప్రమాదవశాత్తూ ఒకరు మృతి చెందగా మిగతా విద్యార్థులంతా అడవిలో దారి తప్పిపోయారు. రాత్రంతా ఆ అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కథ మలుపు తిరిగింది.
తిరుపతిలోని SVCE ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మెుదటి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవులకు నిన్న (శుక్రవారం) వెళ్లారు. ఉదయం శేషాచలం గుంజనా వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకున్న యువకులంతా మధ్యాహ్నం వరకూ అటవీ ప్రాంతాన్ని కలియ తిరిగారు. అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు గుంజానా వాటర్ ఫాల్స్‌లోకి దిగారు. అయితే జలపాతంలో మునుగుతుండగా ఈత రాక ముగ్గురు మునిగిపోగా అందులో ఇద్దరిని సహచర విద్యార్థులు కాపాడాారు. అయితే సాయిదత్త (26) లోతైన గుండంలోకి వెళ్లిపోవడంతో కాపాడలేకపోయారు.