Om Shakti devotees at Mantralayam :మాలధారణలో ఉన్న భక్తులు తీర్థయాత్రలు చేయడం పరిపాటే. అయ్యప్య భక్తులు శబరిమల వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. అదే విధంగా శివభక్తులు శ్రీశైలం, గోవింద మాల భక్తులు తిరుపతి, భవానీలు ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవిని దర్శించుకుని మాల విరమణ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారంతా 41 రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ దీక్ష పూర్తి చేస్తుంటారు. మాలధారులు మండల కాలం (41రోజులు)లో నిత్యం రెండు సార్లు స్నానం చేయడంతో పాటు ఒకే పూట భోజనం, పూజలు, భజనల్లో మునిగితేలుతుంటారు. ఈ క్రమంలోనే వివిధ చారిత్రక ఆలయాలను సందర్శిస్తుంటారు.
మాల ధరించిన భక్తులకు దాతలు భోజనం ఏర్పాటు చేయిస్తుంటారు. మరికొంత మంది దాతలు భక్తుల యాత్రకు అవసరమైన ఖర్చులు సమకూర్చుతారు. ఇది అంతటా జరిగేదే. అయితే కర్ణాటక రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప సైతం మాలధారులకు ప్రతి సంవత్సరం యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారు. బస్సులు సమకూర్చడంతో పాటు యాత్రలో భోజనం సహా పలు అవసరాలకు ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి ఆ రాష్ట్రానికి చెందిన 5వేల మంది ఓం శక్తి మాల ధరించిన మహిళా భక్తుల యాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వారు ప్రయాణిస్తున్న 101 బస్సులు శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం చేరుకున్నాయి.
వెల్లివిరిసిన మతసామరస్యం.. హనుమాన్ మాలలో ముస్లిం వ్యక్తి.. భక్తిశ్రద్ధలతో భజనలు