ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో ఆస్ట్రిచ్​ పక్షి ఆనవాళ్లు - కొనసాగుతున్న పరిశోధనలు - Oldest Ostrich Bird Nest Discovered - OLDEST OSTRICH BIRD NEST DISCOVERED

Oldest Ostrich Bird Nest Discovered in AP: ఆఫ్రికా దేశంలో మాత్రమే కనిపించే ఆస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లను మన రాష్ట్రంలో కనుగొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే ఉండే ఈ జాతి ఉనికిని పురావస్తుశాఖ పరిశోధకులు ప్రకాశం జిల్లాలో గుర్తించారు.

Oldest_Ostrich_Bird_Nest_Discovered
Oldest_Ostrich_Bird_Nest_Discovered (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 3:14 PM IST

Updated : Jun 28, 2024, 3:25 PM IST

Oldest Ostrich Bird Nest Discovered in AP:ప్రపంచంలోనే అతి పెద్ద పక్షిఆస్ట్రిచ్ ఆఫ్రికా అడవుల్లో మాత్రమే కన్పిస్తుందని అందరికీ తెలుసు. ఈ జాతి ప్రస్తుతం ఆఫ్రికాలోనే కన్పిస్తుంది. అయితే ఈ పక్షి ఆనవాళ్లు ప్రకాశం జిల్లాలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసున్నాయి. ఉష్ణపక్షిగా పిలుచుకునే ఈ పక్షి ఉనికి మన రాష్ట్రంలోనూ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లను గుర్తించినట్లు తెలిపారు.

ప్రకాశం జిల్లా పామూరు మండలం మోట్రావులపాడు గ్రామ సమీపంలో ఉన్న మన్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో 41 వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆస్ట్రిచ్ పక్షి గుడ్ల ఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తుశాఖ ఉప సంచాలకుడు సురేష్ తెలిపారు. ఆ శాఖ కమిషనర్ జి. వాణీమోహన్ ఆదేశాలతో మన్నేరు వాగు పరిసర ప్రాంతాలను గురువారం పురావస్తుశాఖ పరిశోధకుల బృందం సందర్శించి సర్వే నిర్వహించారు.

గుంతలో పడిపోయిన చిరుతపులి - పట్టుకునేందుకు అధికారుల ప్రయత్నాలు - Leopard Found in Dig

మన్నేరు వాగు పరిసరాల్లో ప్రాచీన మానవుడు వినియోగించిన ఆయుధాలు, జంతు అవశేషాలు గుర్తించామని సురేష్ వెల్లడించారు. మొసలి, ఇతర జంతువుల అవశేషాలను కూడా గుర్తించి ల్యాబ్​లకు పంపిచామన్నారు. దీనిపై పరిశోధనలు చేసేందుకు ఎంఎస్ వడోదర విశ్వ విద్యాలయానికి చెందిన సహాయ ఆచార్యుడు అనిల్ కుమార్ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం కేంద్ర పురావస్తు శాఖకు దరఖాస్తు చేసుకోగా అనుమతి కూడా లభించినట్లు తెలిపారు.

"జర్మనీ, ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయాల సహకారంతో కొన్ని ప్రదేశాలను గుర్తించి గత నెల నుంచి మన్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపాం. ఈ క్రమంలో ఆస్ట్రిచ్ పక్షుల మూడు గూళ్లను గుర్తించాం. అందులో ఒక పక్షి గూడులో 11 గుడ్లు ఉన్నట్లు గుర్తించాం. ఆ గూళ్లలో ఉన్న గుడ్ల పెంకులను సేకరించి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ, జాతీయ ల్యాబ్​లకు పంపించాం. వాటిని పరీక్షలు చేయించగా కార్బన్ డేటింగ్ ఫలితాల్లో 41 వేల సంవత్సరాల నాటివిగా తేలింది. వీటితో పాటు మొసలి, ఇతర జంతువుల అవశేషాలను కూడా గుర్తించి ల్యాబ్​లకు పంపించాం." - సురేష్, పురావస్తుశాఖ ఉపసంచాలకుడు

మన్యం జిల్లాలో గజరాజుల మృత్యుఘోష - జంతు ప్రేమికుల ఆందోళన - Elephants Dying in Manyam District

Last Updated : Jun 28, 2024, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details