OLD Woman waiting For Pension: అవ్వా తాతలకు అండగా ఉంటా, పింఛన్లు ఇంటికే తెచ్చి ఇస్తా' అని ఊదరగొట్టే సీఎం వైఎస్ జగన్ మాటలకు, వాస్తవాలకు పొంతన కన్పించడం లేదు. వృద్ధర్హురాలైనప్పటికీ విజయవాడలోని ఓ మానసిక వికలాంగ మహిళకు పింఛన్ ఇవ్వకుండా అధికారులు మూడేళ్లుగా తిప్పించుకుంటున్నారు. పింఛన్ కోసం ఆ మహిళ కుటుంబం కళ్లలో ఒత్తులు పెట్టుకుని చూస్తోంది. ఇప్పటికీ పింఛన్ ఆశలు మాత్రం నెరవేరలేదు. పింఛన్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే వెలంపల్లి ఇచ్చిన హామీ కృష్ణా నదిలో కలిసిపోయింది.
ఈ అంధురాలి పేరు జువ్వల భాగ్యవతి. వయసు 64. భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఆమె అనాథగా మిగిలిపోయారు. మానసిక అనారోగ్యంతో సైతం బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె తన చెల్లెలి కుమార్తె రాజశ్రీ వద్ద ఉంటున్నారు. వృద్ధాప్యం , దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. కలవని నేతలేడు, ఇలా గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. విజయవాడ వన్ టౌన్లోని గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన భాగ్యవతి కన్నీటి వ్యధే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కానీ, పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీకి ఈ వృద్ధురాలి గోడు కనిపించడం కనిపించడం లేదు. ప్రభుత్వం తనకు వైసీపీ ప్రభుత్వం తనకు ఆసరా అవుతుందనుకున్న ఈ వృద్ధురాలికి నిరాశే మిగింలింది.
ఇక 2021 ఫిబ్రవరి 18న మున్సిపల్ ఎన్ని కల ప్రచారంలో ఓట్లడిగేందుకు వచ్చిన అప్పటి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు జువ్వల భాగ్యవతి తన గోడు చెప్పుకొన్నారు. మున్సిపల్ ఎన్నికలు కాగానే పింఛన్ ఇప్పిస్తానని మంత్రి మాటిచ్చారు. ఆ ఎన్నికలై మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ పింఛను ఊసే లేదు. ప్రస్తుతం అక్క కుమార్తె రాజశ్రీ దగ్గర, అభాగ్యురాలు ఆశ్రయం పొందుతోంది. గతంలో ఎన్నో సార్లు రాజశ్రీ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదు. చిన్న చిన్న పనులు చేసుకునే రాజశ్రీకి ఇద్దరినీ పోషించుకోవడం ఆర్థికభారంగా మారింది.