Officials No Action on YSRCP Leaders : గుంటూరులో తప్పుడు ఫాం-7 దరఖాస్తులు పెట్టినవారిపై చర్యల విషయంలో అధికారులు, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపుల ఓట్లు తొలగించాలని వైఎస్సార్సీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఫాం-7 దరఖాస్తులు పెట్టినట్లు తేలినా చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నామమాత్రపు కేసులు పెట్టి దులిపేసుకున్నారు. నకిలీ ఓటర్ కార్డులు సృష్టించే అవకాశమిచ్చారని ఏకంగా ఐఏఎస్ అధికారినే కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన నేపథ్యంలో గుంటూరు ఉన్నతాధికారుల మౌనం విమర్శలకు తావిస్తోంది.
తెలుగుదేశం నేతల ఫిర్యాదు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు అత్యధికంగా ఫాం-7 (Form-7) దరఖాస్తులు పెట్టారు. ఓ సామాజిక వర్గం ఇంటి పేరున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఏకంగా 9,895 ఫాం-7 దరఖాస్తులు పెట్టారు. అందులో 7,663 ఆమోదించిన అధికారులు 2052 దరఖాస్తులు తిరస్కరించారు. ఐతే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా పెట్టినవేనని ఎన్నికల అధికారుల విచారణలో తేలింది. అర్హుల ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు శేషిరెడ్డి, కొండా శేషిరెడ్డి, రాము, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, వెంకాయమ్మ పన్నాగం పన్నారని స్వయంగా కార్పొరేషన్ అధికారులే ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు
False Form 7 Applications in Guntur :ఐతే పట్టాభిపురం స్టేషన్ పోలీసులు నామమాత్రపు నామ మాత్రపు సెక్షన్లతో సరిపెట్టారు. వైఎస్సార్సీపీ నేతల్ని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆక్షేపించారు. ఐటీ చట్టం 120-ఏ, 120బి, 416, 419, 420, 66-డి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సిందేనని తెలుగుదేశం నేతలు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్లు మారుస్తామని నెల క్రితం చెప్పిన పోలీసులు ఇంతవరకూ ఆ పనే చేయలేదు.