NTR Fan Kaushik Mother Issue :రాష్ట్రానికి చెందిన కౌశిక్ (19) కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతను జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు దేవర చూడాలని కోరుకుంటున్నట్లు అతడి తల్లిదండ్రులు సెప్టెంబర్‌లో తెలిపారు. అదేవిధంగా తన కుమారుడి వైద్యానికి రూ.60లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని కౌశిక్ తల్లి మీడియా ఎదుట కోరారు. సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, కౌశిక్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ యువకుడికి ధైర్యం చెప్పారు. ఆరోగ్యం తర్వాతే సినిమా అని, త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కౌశిక్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వైద్యులు కౌశిక్‌కి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే సోమవారం నాడు ఆ యువకుడి తల్లి సరస్వతి మీడియాకు ముందుకొచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై తాజాగా ఆమె మరోసారి వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ సర్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ కుటుంబమంతా ఎన్టీఆర్ అభిమానులమేనని వివరించారు.