NTR District Police Commissioner On Security Issues :ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని తెలిపారు. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలింగించేలా చర్యలు చేపడతామన్నారు. సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని తెలిపారు. గ్రీవెన్సెల్ను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు పని తీరును మెరుగు పరుస్తామన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అందరూ సహకరించాలని సీపీ కోరారు. ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారించే దిశగా ముందడుగు వేస్తామన్నారు.
గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డే అండ్ నైట్ బీట్స్ మరింతగా పెంచుతామన్నారు. సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్తామన్నారు. 200 మంది సిబ్బందిని సైబర్ కమాండర్స్‌గా నియమిస్తామన్నారు. రోడ్ సేఫ్టీ పై ప్రత్యేక దృష్టి పెడతామని, కమ్యూనిటీ పోలిసింగ్ అమలు చేస్తామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు తెలిపారు.
'ప్రజలంతా ఇప్పుడు టెక్నాలజీని అనుసంధానం చేసుకుని పోలీసుల సేవలను వినియోగించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. డయల్ 100, 112, 1930 ద్వారా ఫిర్యాదు చెయ్యెచ్చు. అలాగే సిటిజన్.ఏపీ పోలీస్.జీవోవీ.ఇన్ నుంచి తమ సమస్యలు పోలీసులకు చేరవెయ్యచ్చు.' - విజయవాడ నూతన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు