Nomination For AP Elections: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో జరుగనున్న ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరుగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్ 25 తేదీ వరకూ నామినేషన్లుదాఖలు చేసేందుకు తుది గడువుగా ఈసీ ప్రకటించింది. 26వ తేదీన నామినేషన్లు పరిశీలన చేయనున్నారు. అలాగే 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా పేర్కొన్నారు.
ఏపీలో రేపటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ - Nomination Process For AP Elections
హిందూపురం అభ్యర్థి బాలకృష్ణ నామినేషన్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేబాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర దేవితో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నామినేషన్ వేయడానికి ముందు ఉదయం హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో బాలకృష్ణ పూజలు నిర్వహించారు.
Balakrishna Election Campaign: హ్యాట్రిక్ విజయాల దిశగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగులు వేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే పార్టీల కతీతంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన బాలకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలను సైతం కొనసాగిస్తున్నారన్నారు. ఈనెల 12 నుంచి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి నుంచి స్వర్ణాంధ్ర సాకార యాత్ర ప్రారంభమైందని తెలిపారు. రాయలసీమ పర్యటన అనంతరం ఉత్తరాంధ్రలో బాలకృష్ణ ప్రచారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో బాలకృష్ణఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.