ఐదు తరగతులు - ఒకే గది - ఇవేమీ చదువులు Government School Problems in Srikakulam District :కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస ప్రాథమిక పాఠశాలే ఇందుకు నిదర్శనం. ఇరుకు గదిలో 36 మంది విద్యార్థులు కనీస వసతులు లేకుండా ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో తిని, చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రాథమిక విద్య ఛిన్నాభిన్నం
No Room in Govt Primary School in Vennelavalasa : శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామంలో పాఠశాల నిర్మించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ వసతుల లేమి వెంటాడుతోంది. ఈ పాఠశాలలోని చిన్న గదిలో సుమారు 36 మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్నారు. వెలుతురు కూడా పూర్తిస్థాయిలో లేని గదిలో అక్కడి ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరికీ ఆ ఒక్క గదిలోనే భోజనాలు ఏర్పాటు చేసి అక్కడే తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.
శిథిలావస్థకు భవనం..స్కూల్ వద్దంటున్న తల్లిదండ్రులు
Govt Schools in AP : ఇక్కడి విద్యార్థులందరూ గిరిజన కుటుంబాలకు చెందినవారే. ప్రైవేటు పాఠశాలలో చదువుకునే స్థోమత లేక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరారు. కానీ ఆ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా లేకపోవటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో నేల మీద కూర్చుని విద్యనభ్యసిస్తున్నారు. చిన్న గదిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలోకి వ్యర్థాల నీరు... ఇబ్బందుల్లో విద్యార్థులు
ఒకే గదిలో చాలా మంది కూర్చోవాల్సి వస్తుంది. మాస్టార్ చెప్పే పాఠాలు అర్థం కావడం లేదు. బడిలో సౌకర్యాలు లేవని మా తల్లిదండ్రులు చదువు వద్దుంటున్నారు. నాకు చదువుకోవాలనుంది. దయచేసి మా పాఠశాలకు కొత్త భవనం నిర్మించండి. మా అమ్మానాన్న కూలి పనికి వెళ్తారు. ప్రైవేటు పాఠశాలలో చదువుకునే స్థోమత లేదు. ఉన్న ప్రభుత్వ పాఠశాల ఇబ్బందికరంగా ఉంది. మాకు తగిన సౌకర్యాలు కల్పించండి. -విద్యార్థులు
పాఠశాలకు సంబంధించిన ఫర్నీచర్, వంట సామగ్రి, పుస్తకాలు, ఆట వస్తువులు అన్నీ ఆ గదిలోనే పెట్టడంతో కూర్చొనేందుకు కూడా స్థలం లేదని విద్యార్థులు వాపోతున్నారు. నూతన పాఠశాల భవనం నిర్మించి మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పదో తరగతి వరకు సబ్జెక్టులన్నీ బోధించేది ఒక్కరే !