Nimmagadda Ramesh Kumar Key Comments: రాష్ట్రంలో సీఈఓ వ్యవస్థ పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుందని, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి, మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల విధుల్లో వున్న ఉద్యోగులు రోజుల తరబడి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి రావడం దారుణమన్నారు.
విజయవాడలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు లేకుండా అధికారులు చూడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. తిరుపతిలో గతంలో వున్న కేసుల ప్రకారం పోలీస్ యాక్ట్ 30 చూపి వందలాది మందిని స్టేషన్ కు రావాలంటున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. వీరికి హైకోర్టులో ఉపసమనం వచ్చింది, అయితే దీనికి కారణం అయిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ చేస్తున్న అధికారులు సరిగ్గా వ్యవహరిస్తే ఎన్నిక ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణ, సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఏపీ ఎలక్షన్ వాచ్ పేరుతో వెబ్ సైట్ ను రుపొందించామని, ప్రజలు ఎవరైనా వారి సమస్యను ఫిర్యాదు చేయోచ్చని చెప్పారు. అధికారులు చట్టపరంగా వ్యవహరించాలని నిమ్మగడ్డ రమేష్ సూచించారు. ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులే సక్రంగా విధులు నిర్వహించడం లేదన్నారు. క్రింది స్థాయి ఉద్యోగులు విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరిస్తున్నారని పెర్కొన్నారు. ఉన్నత ఉద్యోగులు మాత్రం దురుసుగా వ్యవహరిస్తున్నారని, వారిలో మార్పు రావాలన్నారు.
బూత్‌ల్లో వాలంటీర్లు ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు - ఇప్పుడు ఈసీ ఆదేశాలే అందరికి రక్ష: సీఎఫ్‌డీ - CFD ON ELECTIONS AND VOLUNTEERS