ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్​ - ఇక పనులు రయ్‌ రయ్‌ - NHAI on Amaravati ORR Project

త్వరలో రాజధాని ఔటర్​ రింగ్​రోడ్డు పనులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

NHAI on Amaravati ORR Project
NHAI on Amaravati ORR Project (ETV Bharat)

Amaravati ORR Updates :రాజధాని అమరావతి ఔటర్​ రింగ్‌ రోడ్‌ త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. రూ.25,000ల కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్​హెచ్ఐ అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్‌మెంట్, డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ఓఆర్ఆర్​ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు.

రాజధాని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్‌మెంట్‌ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ- ఎన్​హెచ్ఐ దృష్టిపెట్టింది. 2018లోనే దీని ఎలైన్‌మెంట్‌ ఖరారు చేయగా, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రాజధానిపై అక్కసుతో ఓఆర్​ఆర్​ను పక్కనపెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. ఓఆర్‌ఆర్‌కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్​హెచ్ఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

Central on Amaravati ORR :189 కిలోమీటర్లు ఉండే ఓఆర్​ఆర్​కు గతంలో ఆర్వీ అసోసియేట్స్‌ అనే సలహా సంస్థ అలైన్‌మెంట్‌ రూపకల్పన, డీపీఆర్‌ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలోనే ఎన్​హెచ్ఐని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఔటర్​ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతివ్వాలని ఎన్​హెచ్​ఐ అధికారులు దిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి వచ్చింది. ఆర్వీ సంస్థతో ఈ వారంలో ఎన్​హెచ్ఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు.

ఓఆర్​ఆర్​ నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం రూ.17,761 కోట్లు. 3404 హెక్టార్ల భూసేకరణకు రూ.4198 కోట్లు అవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.20,000ల కోట్లకు పెరిగింది. భూసేకరణకు సుమారు రూ.5000ల కోట్లు కలిపి ఓఆర్​ఆర్​ నిర్మాణానికి రూ.25,000ల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతుపెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రప్రభుత్వం సమ్మతించింది.

భూసేకరణ భారం లేదు :ఈ క్రమంలోనే భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారుల్ని నామినేట్‌ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్​హెచ్ఐ అధికారులు లేఖలు రాశారు. అలైన్‌మెంట్, డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించనున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం 80-90 శాతం భూసేకరణ జరిగితే టెండర్లు పూర్తిచేసి, గుత్తేదార్లకు పనులు అప్పగిస్తారు. ఎంత త్వరగా భూసేకరణ పూర్తయితే, అంతేవేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

రాజధాని అమరావతి కలుపుకొంటూ జాతీయ రహదారి-16 నిర్మాణం - National Highway Near By Amaravati
అమరావతికి రూ.15000 కోట్లు- పూర్తి బాధ్యత కేంద్రానిదే! - World Bank Loan to Amaravati

ABOUT THE AUTHOR

...view details