Newly Wed Bride Suicide in Kothagudem : సాధారణ అమ్మాయిలా కాకుండా ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలి అనుకుంది. వయస్సు రాగానే ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి ఇప్పుడు పెళ్లి వద్దని చదువువైపే తన అడుగులు అంది. కానీ ఇంట్లోవారు తమకు ఆరోగ్యం బాగుండటం లేదని బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. తల్లిదండ్రుల మాటలు కాదనలేక తల వంచి తాళి కట్టించుకుంది. కానీ ఆమె ఆశయాలు ఆమెను వీడలేదు. చదువుపై మక్కువ తీరక, భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకోలేక పోయింది.
ప్రేమ పేరుతో మోసం.. మైనర్‌ను గర్భవతిని చేసిన యువకుడు
చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించారో అర్థం చేసుకున్న ఆ అమ్మాయి, ఆ కష్టమంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరైందని బాధ పడింది. తన కోసం, తల్లిదండ్రుల కోసం ఏం చేయలేకపోతున్నానని మనస్తాపం చెందింది. కనీసం తల్లిదండ్రులు కూడా తన ఆశలను అర్థం చేసుకోలేకపోయారని చింతించింది. భవిష్యత్ గురించి కలలు కనే హక్కు లేని తనకు బతకే అర్హత లేదని భావించిందో ఏమో, పదహారు రోజుల పండుగకు పుట్టింటికి వచ్చిన ఆ నవ వధువు తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రాణం విడిచింది. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్య బంజర్ గ్రామంలో చోటుచేసుకుంది.