ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యూఇయర్​ వేడుకలకు ఫిల్మ్​సిటీ స్వాగతం - ఇక సందడే సందడి - NEW YEAR CELEBRATIONS 2025

నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలుకుతున్న రామోజీ ఫిల్మ్​సిటీ - దేశంలోనే నంబర్‌ వన్‌ డీజేగా పేరుగాంచిన డీజే చేతస్‌ ప్రదర్శన

Ramoji New Year Celebrations 2025
Ramoji New Year Celebrations 2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 24 hours ago

Ramoji Film City New Year Celebrations 2025 :గడిచిన సంవత్సరం జ్ఞాపకాలను గర్తుకుచేసుకుంటూ రానున్న కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగు పెట్టాలనుకునే వారికి రామోజీ ఫిల్మ్​​సిటీలో ఈ నెల 31న న్యూ ఇయర్ పార్టీ స్వాగతం పలుకుతుంది. పాటలు, డాన్సులతో ఉత్సాహపరుస్తున్నారు. దేశంలోని నంబర్ వన్ డీజేగా పేరుగాంచిన డీజే చేతస్ తన ప్రదర్శనతో పర్యాటకుల్ని ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యారు.

ఫుల్ జోష్ నింపే డీజే బీట్లను ఆస్వాదిస్తూ సందర్శకులు నూతన సంవత్సర వేడుకల్లో పాలుపంచుకొనే అవకాశం కల్పిస్తుంది. కొత్త ఏడాది 2025లోకి అడుగు పెట్టే క్షణాలను ఆనందిస్తూ సాయంత్రం వేళ ప్రత్యేక వినోదాలు, ప్రదర్శనల మధ్య న్యూ ఇయర్‌ ఉత్సవాల్లో భాగమై ఎంజాయ్ చేయవచ్చు. పసందైన విందును ఆస్వాదిస్తూ పార్టీలో పాలుపంచుకునే అవకాశం ఉంది.

వినోదభరితంగా న్యూ ఇయర్‌ వేడుకలు : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డీజే చేతస్‌ లైవ్‌ ప్రదర్శనతో పాటు ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు, బాలీవుడ్‌ నృత్య ప్రదర్శనలు, వివిధ ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అంతర్జాతీయ ఫైర్స్‌ యాక్ట్స్, జంగిల్‌ థీమ్‌ అక్రోబ్యాటిక్‌ స్టంట్, స్క్విడ్‌ గేమ్స్‌, క్లౌన్, లయన్‌ కింగ్, స్టాండప్‌ కామెడీ షో ఇలా ఎన్నెన్నో విశేషాలు రామోజీ ఫిల్మ్​సిటీ సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.

అనువైన ప్యాకేజీని ఎంచుకోవచ్చు : 31 రాత్రి 8:00 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల్లో పాలుపంచుకోవాలనుకొనే వారు అనువైన ప్యాకేజీని ఎంచుకునేలా వివిధ రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచారు. ప్రీమియం టేబుల్‌ నుంచి ఎక్స్‌క్లూజివ్‌ సీటింగ్‌ ఏరియాలతో పాటు జంటలకు వీఐపీ ప్యాకేజీల మొదలు బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫ్యాన్‌ పిట్‌ ప్యాకేజీలు ఉన్నాయి. రూ.2000ల నుంచి వివిధ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ వేడుకలో పాల్పంచుకోవడానికి విచ్చేయండి.

ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌లో : ముందుగా టికెట్లు బుక్‌ చేసుకునే వారికి ప్రత్యేక ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే రామోజీ ఫిల్మ్‌సిటీ న్యూ ఇయర్‌ పార్టీ ప్రవేశానికి ఇప్పుడే అనువైన ప్యాకేజీని ఎంచుకొని బుక్‌ చేసేసుకోండి.

రవాణా సౌకర్యం : పార్టీ ముగిసిన తర్వాత ఎల్బీనగర్‌ మెట్రోస్టేషన్‌ వరకు రవాణా (షేర్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌) సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి వెళ్లడానికి దోహదపడుతుందని సిబ్బంది పేర్కొన్నారు. వివిధ రకాల ప్యాకేజీలు ఉన్నాయి.

ప్యాకేజీల కోసం :www.ramojifilmcity.com

ఫోన్​ నంబరు - 76598 76598సంప్రదించవచ్చు.

Ramoji Film City MICE Delhi 2023 : దిల్లీలో రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్.. ఆసక్తిగా తిలకించిన రష్యా టూరిస్ట్​లు!

కోల్​కతా ట్రావెల్​ ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్​ సిటీ అదుర్స్​- బెస్ట్ డెకరేషన్ అవార్డు సొంతం - ramoji film city award

ABOUT THE AUTHOR

...view details