Organic Ice Cream:ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే ఎక్కువ తింటే ఆరోగ్యం ఎమౌతుందో అనే సందేహం వెంటాడుతూ ఉంటుంది. దీనికి ఎలాగైనా పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాడు ఈ యువకుడు. అతని ఆలోచననే వ్యాపారంగా మలుచుకున్నాడు. సేంద్రియ పదార్థాలు ఉపయోగించి నోరూరించే ఐస్‌క్రీమ్‌లు తయారుచేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఈ యువ వ్యాపారవేత్త.
నెల్లూరు నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన బొమ్మిశెట్టి సుహాస్ ఫార్మసీలో పీహెచ్డీ పూర్తిచేశాడు. ఉద్యోగం చేయడం కంటే ఎదైనా వ్యాపారంలో రాణించాలన్నది ఈ యువకుడి కల. ఆ తపనతోనే అందరూ ఇష్టపడే ఐస్‌క్రీమ్‌ను రసాయనాలు వాడకుండా ప్రకృతి సిద్దంగా తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2013లో ఐస్‌బర్గ్ పేరుతో కేవలం 3 లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు. అప్పటి నుంచి అంచలెంచలుగా ఎదుగుతూ ఇప్పుడు ఏడాదికి 25 కోట్ల టర్నవర్ సాధిస్తున్నాడు.
ఇడ్లీ, దోశ, ఉప్మా - అక్కడ రూ.10కే టిఫిన్ - ఇంటి రుచికి ఏమాత్రం తీసిపోదు! - 10 RUPEES TIFFIN CENTRE STORY
తను నమ్ముకున్న సిద్దాంతం కోసం అహర్నిశలు శ్రమించాడు సుహస్. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయని ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవాలని కుటుంబ సభ్యులు సలహా ఇచ్చినా తాను మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా ముందుకుసాగాడు. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దేశం నలుమూలలా 125 స్టోర్‌లు ఏర్పాటు చేయగలిగాడు అంటే వ్యాపారం రంగంలో రాణిచాలన్న తన తపన ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు.
వెనిలా, బటర్‌స్కాచ్, చాక్లెట్ వంటి ఫ్లేవర్లే కాకుండా పనస, మామిడి, కొబ్బరినీళ్లు, డ్రాగన్ ప్రూట్, జామ వంటి విభిన్న రుచుల్లో ఐస్ క్రీములు తయారు చేస్తున్నాడు సుహాస్. ఆవు, ఒంటె, మేకపాలతో వీటిని తయారు చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. వినూత్నమైన ఆలోచనలతో దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం వ్యాపారాన్ని విస్తరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు ఈ యువ వ్యాపారవేత్త.
దేశంలోనే మొట్ట మొదటి ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారీ సంస్థను ఎర్పాటు చేశాడు సుహాస్. బయట దోరికే ఐస్‌క్రీమ్‌లకు, ఐస్ బర్గ్ ఉత్పత్తులకు చాలా తేడా ఉంటుంది అంటున్నాడు. పాల నుంచి ప్యాకింగ్ వరకు అన్నింటా సేంద్రియానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే సంస్థకి మంచి పేరు వచ్చిందని చెప్తున్నాడు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఈ ఐస్ క్రీమ్స్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam
ఐస్‌క్రీమ్స్‌లో చక్కెరకు ప్రత్యామ్నాయంగా పటికబెల్లాన్ని ఉపయోగించడం పైన ప్రయోగాలు చేసి విజయం సాధించాడు ఈ యువకుడు. మిగతా ఐస్‌క్రీముల్లా పండ్ల నూనెల్ని వాడకుండా పండ్ల రసాల్ని వాడుతున్నాడు. రుచి కోసం ఉత్తరాదిన ఆహార పదార్థాల్లో వాడే గోంద్‌ని ఉపయోగించే ప్రత్యేక విధానాన్ని ఆవిష్కరించాడు. ఆ పద్ధతికి పేటెంట్ కూడా సాధించాడు.
ఒకప్పుడు నెల్లూరులో చిన్న వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు ఆల్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సాధించిన తమ కూమారుడిని చూస్తుంటే గర్వంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. ఒక్కడిగా మొదలై వందల మందికి ఉపాధిని కల్పిస్తుడటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు.
నాణ్యతలో రాజీపడకుండా, ప్లాస్టిక్ వాడకుండా పూర్తిగా కాగితాలతోనే కప్పులను తయారుచేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు సుహాస్. యువత ఆసక్తి ఉన్న రంగంలోనే కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని సుహస్ విషయంలో ఋజువైంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచే తమకి ఆసక్తి ఉన్న రంగంలోనే ప్రోత్సహించాలని ప్రముఖులు సూచిస్తున్నారు.
కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు - Kuchipudi in Srikakulam district