తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు - భక్తజనసంద్రంగా మారిన ఆలయం

పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన ఉత్సవాలు - చివరిరోజున శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చిన జగన్మాత - అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Dussehra Celebrations AT Indrakeeladri Durga Temple
Dussehra Celebrations AT Indrakeeladri Durga Temple (ETV Bharat)

Dussehra Celebrations AT Indrakeeladri Durga Temple :ఆంధ్రప్రదేశ్​లోనిఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. చివరిరోజున అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు పోటెత్తడంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోయింది. మరోవైపు ఏటా కృష్ణా నదిలో నిర్వహించే జలవిహారానికి నీటి ఉద్ధృతి పెరగడం వల్ల ఈసారి అనుమతి నిరాకరించారు.

చివరిరోజు రాజేరాజేశ్వరిగా దర్శనమిచ్చిన జగన్మాత :విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా గత 9 రోజులు వివిధ అలంకారాల్లో భక్తులను కటాక్షించిన జగన్మాత చివరి రోజైన విజయదశమి నాడు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు అభయమిచ్చారు. స్వప్రకాశ జ్యోతి స్వరూపంతో, పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుని సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవతగా రాజరాజేశ్వరిదేవి పూజలందుకుంటుంది. ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసిన భగవన్నామస్మరణ కనిపించింది. భక్త జనులతో ఆలయ పరిసరాలన్నీ నిండిపోయాయి.

అమ్మవారి దర్శనానికి పొటెత్తిన భక్తులు :నిశ్చల చిత్తంతో తనను ఆరాధించిన వారికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను వరంగా అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. దీంతో అమ్మవారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. చివరిరోజు కావడంతో భవానీ మాల ధరించిన వారు అధిక సంఖ్యలో రాగా క్యూలైన్లన్నీ నిండిపోయి ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. శరన్నవరాత్రుల్లో చివరిరోజున ముందుగా యాగశాలలో చండీహోమం నిర్వహించారు.

పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన ఉత్సవాలు :ఆ తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమాలతో శరన్నవరాత్రి మహోత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. ప్రతి రోజూ జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా బెజవాడలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపించింది. భవానీ మాలదారులు అమ్మవారి దర్శనానికి అధికంగా తరలివచ్చారు.

జూబ్లీహిల్స్​ పెద్దమ్మ తల్లి గుడిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు - Jubilee Hills Peddamma Thalli

Dussehra Festival celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. దుర్గామాత ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details