తెలంగాణ

telangana

ETV Bharat / state

'కోర్టు తీర్పుతో మేము సంతోషంగా లేము - సంజయ్ రాయ్​కి ఉరిశిక్షే కరెక్ట్' - KOLKATA DOCTOR RAPE AND MURDER CASE

ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆందోళన - దోషి సంజయ్ రాయ్​కి కోల్​కతా కోర్టు విధించిన జీవిత ఖైదుశిక్ష పట్ల అసంతృప్తి - తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి

OSMANIA MEDICAL COLLEGE
NATIONAL MEDICOS ORGANIZATION (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 7:04 PM IST

Kolkata Doctor Rape and Murder Case : మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషి సంజయ్ రాయ్​కి కోల్​కతా సీల్దా కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్ష పట్ల నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్​లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, ఉస్మానియా వైద్య విద్యార్థుల ఆధ్వర్యంలో డాక్టర్లు నిరసన తెలిపారు. ఈ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి దేశవ్యాప్తంగా ఉరిశిక్ష విధించాలని వస్తున్న డిమాండ్​ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర బాబు విజ్ఞప్తి చేశారు.

'కోల్​కతా మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేయాలి' (ETV Bharat)

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం : ఆర్​జీకర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిని అతి కిరాతకంగా హతమార్చిన వ్యక్తి జైలులో సాధారణ ఖైదీగా జీవించే హక్కు కూడా లేదని డాక్టర్ సురేంద్ర బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనలో త్వరితగతిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ నేరం చేసిన వ్యక్తి సంజయ్ రాయ్​కి జీవించే హక్కు లేదన్నారు. ఇప్పటికైనా మహిళా వైద్యులకు రక్షణ కల్పించి, చట్టాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు నిరసన తెలిపే క్రమంలో చెప్పారు. ఈ కేసులో తెర వెనుక ఉన్న దోషులను కూడా గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

"కోర్టు తీర్పుతో మేము సంతోషంగా లేము. ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్లినా సేఫ్టీ లేదు. ఆసుపత్రుల్లో గానీ, వివిధ ప్రాంతాల్లో గానీ సేఫ్టీ లేకపోవడం వల్ల డాక్టర్స్​కి చాలా కష్టంగా ఉంది. ఈ కోల్​కతా వైద్యురాలి కేసులో న్యాయం జరగాలి" -తన్వీ, యువ వైద్యురాలు

ఆహారం ఇచ్చేందుకు వెళ్లి.. వైద్యురాలిపై అత్యాచారం!

ఇబ్రహీంపట్నంలో దారుణం - ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థినిపై డ్రైవర్‌ అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details