కేరళలో తెలుగుతేజం కృష్ణతేజకు జాతీయస్థాయి పురస్కారం- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు (ETV Bharat) National Award to Krishna Teja : యువ ఐఏఎస్ (IAS) అధికారి కృష్ణతేజకు మరో అరుదైన గౌరవం దక్కింది. IASగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి అద్భుత పని తీరుతో ఆకట్టుకుంటూ అడుగుపెట్టిన ప్రతిచోటా తనదైన ముద్ర వేస్తున్న తెలుగుతేజం కృష్ణతేజ జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా కలెక్టర్గా మాదకద్రవ్యాలపై యుద్ధంలో కృష్ణతేజ చేసిన సేవలకు గానూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆయన్ను ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది.
National Commission for Child Protection Award to ias krishna teja : మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా " ఏక్ యుద్ధ్ నషే కే విరుద్ధ్" పేరుతో 2021 ఫిబ్రవరి నుంచి ఎన్సీపీసీఆర్(NCPCR) ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. చిన్నారుల్లో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం నేపథ్యంలో పాఠశాలలు, చిన్నారుల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో నిషేధిత ఉత్ప్రేరకాల అమ్మకాలు, అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమంలో త్రిస్సూర్ జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు కృష్ణతేజ.
కలెక్టర్ బదిలీ.. వినూత్నంగా వీడ్కోలు.. వీడియో వైరల్
Pawan Kalyan appreciates to Ias krishna : ఈ నేపథ్యంలోనే ఈ నెల 27న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో కృష్ణతేజకు పురస్కారం అందజేయనున్నట్లు NCPCR ప్రకటించింది. డ్రగ్స్ అనే మాట వినిపించకుండా చేయడమే లక్ష్యమని కృష్ణతేజ ఓ ప్రకటనలో వెల్లడించారు. కృష్ణతేజకు జాతీయ పురస్కారంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి కృష్ణతేజ ఎంపికకావడంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని సేవలందిస్తూ ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్ననట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా, కేరళ వరదల విపత్తు సమయంలోనూ కృష్ణతేజ సేవలు ప్రజలు మరచిపోలేదన్నారు. కృష్ణతేజ గతంలోనూ అనేక కీలకమైన ఘనతలతో వార్తల్లో నిలిచారు. కేరళ వరదల సమయంలో బాధితులకు అండగా నిలిచినప్పుడు, వారికి సహాయ పునరావాస చర్యలు, తిరిగి శాశ్వత గృహాల నిర్మాణం వంటి చర్యలతో స్థానికుల మనసులు గెలుచుకున్నారు. గ్రీన్ బఫర్ జోన్‌లో నిర్మించిన వందల కోట్ల విలువైన అక్రమ కట్టడం క్యాపికో రిసార్ట్‌ని ఒత్తిళ్లకు వెరవకుండా నేలమట్టం చేయించి దేశం మొత్తం తనవైపు చూసేలా చేశారు.
కేరళ పర్యాటక శాఖ సంచాలకుడిగా కృష్ణతేజ నియామకం