Nara Lokesh On NDA Success :జనం ఎగురవేసిన జయకేతనం ఈ అఖండ విజయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యమన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి అద్భుత విజయాన్ని అందించిన అశేష ప్రజానీకానికి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అద్భుత విజయం ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపమని కొనియడారు. సమష్టిగా పని చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు. ఆదరించిన ప్రజలు, అహర్నిశలు పని చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Atchannaidu Comments on NDA Victory : గత అయిదేళ్లుగా ప్రజలను జగన్రెడ్డి ఎంత వేధించాడనే దానికి నేటి ఫలితాలు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలను ఎంతలా ఇబ్బందులు పెట్టారో వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లు చెప్తున్నాయని ధ్వజమెత్తారు. రౌడీలు, గూండాలతో పాలించి ఆర్ధికంగా, మానసికంగా ప్రజలంజ హింసించారని దుయ్యబట్టారు. వాలంటరీ వ్యవస్థలను పెట్టి ఆరాచకాలు చేశారని మండిపడ్డారు. అది చేశాం, ఇది చేశామని వైఎస్సార్సీపీ చేసిన అబద్దపు ప్రకటనలను ప్రజలు నమ్మలేదన్నారు. నేటితో అరాచక ప్రభుత్వానికి స్వస్తి, ప్రజాలచే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు.