Nara lokesh on Current Bills : సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో సామాన్యులపై పడని భారం లేదు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే అని నిరూపిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ బిల్లులపై వీర బాదుడు బాదుతున్నారు. విద్యుత్ ఛార్జీల మోతే ఇందుకు నిదర్శనం. సీఎం జగన్ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి అక్షరాలా 27,442 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. తాజా విద్యుత్ చార్జీల పెరుగుదల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు.
Electricity Charges Huge Increase in YSRCP Government: నాలుగేళ్లుగా విద్యుత్ బిల్లులపై జగన్ వీర బాదుడు.. షాక్ కొట్టేలా కరెంటు బిల్లులు
#NakuShockKottindhi హ్యాష్ ట్యాగ్ : జగన్ బాదుడే బాదుడు అంటూ నారాలోకేశ్ ధ్వజమెత్తారు. ఈ నెల మీ కరెంట్ బిల్లు ఎంత వచ్చింది? బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా అని ట్వీట్ చేశారు. షాక్ కొడితే మీ కరెంట్ బిల్లును సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌పై #NakuShockKottindhi హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని అన్నారు.
అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా? :దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చి దిద్దుతానని టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేశ్ గుంటూరు జిల్లా చినకాకానిలోని యార్లగడ్డ వెంకట్రావు కాలనీలో ప్రజలతో సమావేశం అయ్యారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి గోల్డ్ స్టోరేజ్ బాధిత రైతులు తమను ఆదుకోవాలని లోకేశ్‌కు వినతి పత్రం ఇచ్చారు.
Electricity Charges Huge Increase in YSRCP Government: మాట తప్పి.. మడమ తిప్పేసిన జగన్.. విద్యుత్ ఛార్జీలను ఎడాపెడా పెంచి ప్రజలకే షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం
కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం జరిగి మూడు నెలలు అవుతున్న ఇంతవరకు పరిహారం అందించలేదని రైతులు విన్నవించారు. అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్స్పీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు - ప్రజలపై 1,723 కోట్ల భారం