Nara Chandrababu Naidu Made Key Comments: మోదీ ఒక వ్యక్తికాదు, భారత దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి, మోదీ అంటే సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రదాని నరేంద్రమోదీ అని కొనియాడారు. పీఎం అన్నయోజన, ఉజ్వల, జలజీవన్ యోజన లాంటి పథకాలతో సంక్షేమానికి కొత్త బాష్యం చెప్పిన వ్యక్తి మోదీ అని అన్నారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు డిజిటల్, స్కిల్ ఇండియా లాంటి పథకాలు తెచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.
5 స్థానానికి ఆర్ధికవ్యవస్థ: సబ్ కా సాత్, సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి నమ్మకాన్ని కలిగించిన శక్తివంతమైన నేత మోదీ అని చంద్రాబబు పేర్కొన్నారు. కోవిడ్ సంక్షోభంలో ప్రపంచ దేశాలు ఎవరూ చేయలేని విధంగా దేశప్రజల ప్రాణాల్ని రక్షించిన వ్యక్తి మోదీ అని చంద్రబాబు వివరించారు. వందదేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్ధతను చాటిచెప్పారన్నారు. 11 స్థానంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థ 5 స్థానానికి తీసుకువచ్చారు. వచ్చే రోజుల్లో 3 స్థానానికీ వస్తామన్నారు. వికసిత్ భారత్ నరేంద్రమోదీ కల, వికసిత ఆంద్రప్రదేశ్ మనందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
పేదరికం లేని దేశంగా భారత్ : ఏపీ కూడా అభివృద్ధిని అందిపుచ్చుకోవాలి, పేదరికం లేని దేశం, రాష్ట్రం కోసం ప్రదాని ఆశయాలతో కలిసి ప్రయాణించాలన్నారు. వికసిత్ భారత్ కేలియే ఏహీ సమయ్ హై, సహి సమయ్ హై అంటూ చంద్రబాబు హిందీ లో ప్రసంగించారు. మోదీ జైసా సహీ నేతా దేశ్ కో మిలాహై అంటూ హిందీలో చెప్పారు. భారత్ పేదరికం లేని దేశంగా తయారు చేసే శక్తి మోదీ వద్దే ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సవాళ్లను ఎదుర్కోన్నామన్నారు.
శాండ్, ల్యాండ్, వైన్, మైన్, అన్ని రంగాల్లో సీఎం జగన్ దోపిడీ: చంద్రబాబు అమరావతి పూర్తై ఉంటే:కేంద్ర సహకారంతో 11 జాతీయ సంస్థలను ఏపీలో స్థాపించుకున్నామన్నారు. అమరావతి పూర్తై ఉంటే దేశానికి మంచినగరంగా తయారై ఉండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మూడుముక్కల ఆటతో రాజధానిని బ్రష్టు పట్టించిన వ్యక్తి సీఎం జగన్ అని దుయ్యబట్టారు. పోలవరాన్ని గోదావరిలో ముంచి ల్యాండ్, శాండ్, వైన్ ,మైన్ ఇలా అన్నిట్లోనూ జగన్ వేలకోట్ల దోపిడీ చేశారని ఆక్షేపించారు. పేదప్రజల ప్రాణాల్ని ఫణంగా పెట్టి వేలకోట్లు జగన్ దోచుకున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో రోడ్లులేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు, ఉపాధీ లేదు, ప్రజల జీవితాల్లో ఆనందమూ లేదు, అంతటా అశాంతి, అభద్రత నెలకొందన్నారు.
రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుంది: పవన్ కల్యాణ్
మహిళలకు భద్రత లేదు: విధ్వంసమే విధానంగా రాష్ట్రాన్ని కూల్చిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై కక్షసాధింపుతో అక్రమకేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని జగన్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించుకుని అక్రమకేసులు పెట్టారన్నారు. బాబాయిని కూడా హత్యచేసిన జగన్ కు ఓటు వేయొద్దని ఆయన చెల్లేళ్లే విజ్ఞప్తి చేశారన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు భద్రత లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎస్సీఎస్టీ మైనారిటీలకు ఏలాంటి లాభమూ జరగలేదు, అంతా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్ధికంగా అస్తవ్యస్థ విదానాలు, దుర్మార్గమైన పాలనతో రాష్ట్రం నాశనమైందన్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారు, భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి నాశనం చేశారని చంద్రబాబు వాపోయారు.
అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: ప్రధాని మోదీ