Nara Bhuvaneshwari Interesting Comments:తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గత కొంతకాలంగా, టీడీపీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇన్నాళ్లూ వ్యాపార బాధ్యతలు చూసుకున్న భువనేశ్వరి, చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలతో తెలుగుదేశం పార్టీకి తన వంతు సహాయ సహాకారాలు అందిస్తున్నారు. తాజాగా కుప్పంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కుప్పంలో మీ ఓటు చంద్రబాబుకా - భువనేశ్వరికా ? ఇద్దరికి ఓటు వేస్తామన్న టీడీపీ శ్రేణులు: కుప్పంలోని టీడీపీ కార్యకర్తలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబుకు ఓటేస్తారా? తనకు ఓటేస్తారా ? అంటూ కుప్పం కార్యకర్తలతో సరదా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బదులు తాను పోటీ చేస్తే గెలిపించుకుంటారా అంటూ ప్రస్తావించారు. చంద్రబాబుని 35ఏళ్లు గెలిపించినందున ఈసారి తనను గెలిపిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇద్దరూ కావాలంటూ శ్రేణుల నినాదాలు చేశారు. ఒక్కరి పేరే చెప్పాలంటూ ఆమె కోరారు, తాను సరదాగా జోక్ చేశానని, రాజకీయాలకు తానెప్పుడూ దూరమని స్పష్టం చేస్తూ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari ) చర్చను ముగించారు.
భువనేశ్వరికి గుండెనొప్పి వచ్చేలా చంద్రబాబు చేసిన పని ఏంటీ?
చంద్రబాబు పాలనలో ఆడపిల్లలు స్వేచ్ఛ:రాష్ట్రాభివృద్ధి గురించే చంద్రబాబు అనుక్షణం ఆలోచిస్తారని, నారా భువనేశ్వరి అన్నారు. యువత, మహిళల పురోభివృద్ధికి ఏవిధంగా కృషి చేయాలా అనే తపనే ఆయనలో ఉందన్నారు. 'ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ' అంశంపై కుప్పం మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో ఆడపిల్లలు స్వేచ్ఛగా జీవించేవారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక భద్రత కరవైందని విమర్శించారు. దిశ పేరిట మభ్యపెట్టడం తప్ప, మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అధః పాతాళానికి దిగజార్చి, గంజాయిలో నెంబర్-1గామార్చేశారని నారా భువనేశ్వరి మండిపడ్డారు.
కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి
టీడీపీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ: గత కొంత కాలంగా నారా భువనేశ్వరి ప్రజలతో మమేకమవుతున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ మెుదలు, తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సందర్భంలో సైతం పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడానికి లోకేశ్‌తో కలిసి మీడియా సమావేశాలు సైతం నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలతో కలత చెంది మృతి చెందిన వారి కుంటుంబాలకు తాను అండగా ఉంటానంటూ, నిజం గెలవాలి పేరుతో పరామర్శ యాత్ర చేపడతున్నారు. వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు అరెస్ట్‌తో కుప్పుంలో మృతి చెందిన రెండు కుటుంబాలను, నిన్న భువనేశ్వరి పరామర్శించారు. వారికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులే: నారా భువనేశ్వరి