ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీ ఆస్తులనూ తాకట్టు పెట్టేస్తారు - జాగ్రత్త: భువనేశ్వరి - Nara Bhubaneswari Tours

Nara Bhuvaneshwari Allegations on CM Jagan in Nijam Gelavali Yatra: 'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశారని అప్పులు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఎక్కడా వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

nara_bhuvaneshwari
nara_bhuvaneshwarit

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 10:50 PM IST

వైసీపీ ప్రభుత్వం సచివాలయం సహా అన్నీ తాకట్టుపెట్టింది: భువనేశ్వరి

Nara Bhuvaneshwari Allegations on CM Jagan in Nijam Gelavali Yatra:సచివాలయాన్నే తాకట్టు పెట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, రేపు మీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేస్తాడు జాగ్రత్త అంటూ నారా భువనేశ్వరి ప్రజలను అప్రమత్తం చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైలులో పెట్టారన్నారు. అనంతరం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నారా భువనేశ్వరి పాల్గొని ప్రభుత్వ వైపరీత్యాలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు రోజూ ఓటరు జాబితాలో మీ ఓటు ఉందో లేదో చూసుకోవటంతో పాటు మీ ఆస్తులు, భూములు ఉన్నాయో లేదా చూసుకోవాలని చెప్పారు.

పాడేరులో 'నిజం గెలవాలి' - గిరిజనులతో ఆడిపాడిన భువనేశ్వరి

చంద్రబాబు ఎప్పుడూ అవినీతి చేయలేదు, చేయరని నారా భువనేశ్వరి అన్నారు. రాష్ట్ర రాజధాని ఇది అని చెప్పుకోటానికి లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం మీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేస్తుంది జాగ్రత్త అంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. మీరు, మీ పిల్లలు బాగుండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడని, అలాంటి వాడు పాలకుడిగా ఉంటేని మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించగా, ఈ ప్రభుత్వం ఒక్క పరిశ్రమ అయినా తీసుకురాగలిగిందా అంటూ భువనేశ్వరి ప్రశ్నించారు.

కార్యకర్తల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం - నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి

బిందెడు తాగునీరు అడిగినందుకు వైసీపీ నాయకులు మహిళను ట్రాక్టర్​తో ఢీ కొట్టి హత్యచేశారని ఆమె ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడిపై నమ్మకంతో అమరావతి రైతులు 33 వేల ఎకరాల భూమి రాజధానికోసం ఇచ్చారని భువనేశ్వరి చెప్పారు. త్యాగం చేసిన రైతులను, ముఖ్యంగా మహిళా రైతులను ఈ ప్రభుత్వం పోలీసులతో బూటు కాళ్లతో తన్నించిందన్నారు. ఈ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశారని అప్పులు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఎక్కడా వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు, భవనాలు ఎలా ఏది ఉంటే అది ఈ ప్రభుత్వం తాకట్టు పెట్టేస్తుందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న వారంతా సిగ్గుపడాలని నారా భువనేశ్వరి తెలిపారు.

కుప్పంలో మీ ఓటు చంద్రబాబుకా? - భువనేశ్వరికా?

రానున్న కురుక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల మంచి కోసం, యువత భవిష్యత్తు కోసం నిత్యం తపనపడే చంద్రబాబు నాయుడును ఎన్నుకోవాలని భువనేశ్వరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో గుండెపోటుకు గురైన మృతి చెందిన అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. బాధితుల కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details