ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్​ జిల్లాలో దారుణం - ఇంటర్‌ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కీచకుడు

హత్యాయత్నంపై సీఎం చంద్రబాబు ఆరా - పోలీసుల అదుపులో నిందితుడు

Murder Attempt on Inter Student
Murder Attempt on Inter Student (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 4:46 PM IST

Updated : Oct 19, 2024, 9:32 PM IST

Murder Attempt on Inter Student:ఇంటర్‌ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు సమీపంలో చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థినిపై విగ్నేష్ అనే వ్యక్తి పెట్రోల్‌ పోసి హత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కొందరు మహిళలు గుర్తించి విద్యార్థినిని రక్షించి పోలీసులకు సమాచారం అందిచారు. అమ్మాయిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి కడప రిమ్స్ తరలించారు.

8వ తరగతి నుంచే వేధింపులు: బాధితురాలైన మైనర్ బాలిక ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలనీకి చెందిన విగ్నేష్ అనే వ్యక్తితో బాలికకు గతంలోనే పరిచయం ఉంది. ఇటీవలే వివాహం చేసుకున్న విగ్నేష్ ఇవాళ కళాశాల నుంచి బాలికను ఆటోలో తీసుకెళ్లాడు. ముళ్లపొదల్లోకి వెళ్లిన తర్వాత బాలిక ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కేకలు వేస్తున్న సమయంలో సమీపంలో ఉన్న కొందరు మహిళలు గుర్తించి బాలికను కాపాడారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను విఘ్నేష్‌ వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. 8వ తరగతి నుంచే విఘ్నేష్‌ వేధిచేవాడని అతనికి వివాహమైనా తమ కుమార్తె వెంట పడేవాడని బాలిక తల్లిదండ్రులు అన్నారు.

వైఎస్సార్​ జిల్లాలో దారుణం - ఇంటర్‌ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కీచకుడు (ETV Bharat)

ప్రేయసిపై బ్లేడ్​తో దాడి చేసిన ప్రియుడు- ప్రేమ పేరుతో వేధింపులు!

ఇద్దరూ ఒక ప్రాంతానికి చెందిన వారే: ఈ ఘటనపై బద్వేల్‌ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెళ్లి ఆరా తీశారు. ఈ క్రమంలో ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థినికి 80 శాతం గాయాలయ్యాయని అన్నారు. విద్యార్థినికి కడప రిమ్స్‌లో చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. చిన్నప్పటి నుంచే ఇద్దరికీ పరిచయం ఉందని, ఇద్దరూ ఒక ప్రాంతానికి చెందిన వారేనని ఎస్పీ వివరించారు. తనను కలవాలని విద్యార్థినికి విఘ్నేష్‌ ఫోన్‌ చేశాడని, కలవకపోతే చనిపోతానని బెదిరించాడని అన్నారు. ఇద్దరూ పీపీకుంట చెక్‌పోస్ట్‌ సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లాక విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి విఘ్నేష్‌ పరారయ్యాడని ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. పోలీసులు 4 బృందాలతో గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

CM Chandrababu Serious:కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. విద్యార్థినిని కడప రిమ్స్​కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని తేల్చిచెప్పారు.

ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోలు బాంబుతో దాడి - ఒకరు అరెస్ట్, మరొకరు పరారీ - Petrol Bomb Attack in TEACHER HOUSE

కానిస్టేబుల్​కు నిప్పంటించి హత్య చేసిన ప్రేయసి- వాంగ్మూలం మార్చి మరీ చనిపోయిన పోలీస్!

Last Updated : Oct 19, 2024, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details