Leaders Joined Janasena in the Presence of Pawan Kalyan: జనసేనలో చేరికలు మాపై విశ్వాసాన్ని మరింతగా పెంచాయని జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ క్రమంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన కొంతమంది నేతలు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. కుటుంబాలను విడదీసే ఆలోచన లేకే ముద్రగడ్డ క్రాంతిని ఎన్నికల సమయంలో పార్టీలోకి చేర్చుకోలేదని స్పష్టం చేశారు.
- గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు నిమ్మల వెంకట రమణ, సంకూరి శ్రీనివాసరావు, ఇర్రి ధనలక్ష్మి, అయిశెట్టి కనకదుర్గ పార్టీలో చేరారు.
- జగ్గయ్యపేట మున్సిపాలిటి కౌన్సిలర్లు కొలగాని రాము, కాశీ అనురాధ, తుమ్మల ప్రభాకర్ రావు, కాటగాని శివ కుమారి, తన్నీరు నాగమణి , సాధుపాటి రాజా, పాకలపాటి సుందరమ్మ, షేక్ సిరాజున్, మోరే సరస్వతి, పండుల రోశయ్య, కోఆప్షన్ మెంబర్లు చైతన్య శర్మ, ఖాదర్ బాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఆకుల బాజీ, వీరయ్య చౌదరి పార్టీలో జాయిన్ అయ్యారు.
- పెడన నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ జక్కా ధర్మారాయుడుతోపాటు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు, నాయకులు పార్టీలో చేరారు. వారందరికీ పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సంక్రాంతికి 'పల్లె' కళకళలాడాలి - చంద్రబాబు అనుభవం మాకు ఎంతో బలం: పవన్ కల్యాణ్
పల్లెపండుగ ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి బాటలు: ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సామినేని ఉదయభానుపై నమ్మకంతో ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు ఇచ్చామని అన్నారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయని వెల్లడించారు. ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పని చేస్తోందని అంతే కాకుండా రాష్ట్రంలో అవినీతి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. రూపాయి లంచం లేకుండా, సిఫార్సులు లేకుండా బదిలీలు జరిగాయని అన్నారు. కూటమి ఎమ్మెల్యేలు సిఫార్సులు చేసినా క్షుణ్ణంగా పరిశీలించి బదిలీలు చేసినట్లు వివరించారు. లంచం అనే పదం వినిపిస్తే కార్యాలయం నుంచి వెళ్లిపోవాల్సిందేనని పవన్ కల్యాణ్ అన్నారు.
పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి అవకాశం లేకుండా పనులు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన బదిలీలే అందుకు నిదర్శనం. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై నమ్మకం ఉంచి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. పల్లెపండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి బాటలుపడ్డాయి. లంచం అనే పదం వినిపిస్తే ఎవరైనా కార్యాలయం నుంచి వెళ్లిపోవాల్సిందే.-పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
"ఓజీ ఓజీ అంటే 'మోదీ మోదీ' అని వినిపించేది" - పవన్ నోట హీరోల మాట - ఏమన్నారంటే!