Cambodia Job Racket Arrest :విదేశాల్లో ఉద్యోగాలు పేరుతో యువకులను చేరదీసి కంబోడియాలో సైబర్ నేరాగాళ్ల ముఠాకు అప్పగిస్తున్న కేసులో ముంబయికి చెందిన ప్రియాంక శివకుమార్ సిద్ధును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బ్యూరో డైరెక్టర్ షికాగోయల్ శుక్రవారం చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
ముంబయికి చెందిన ప్రియాంక గతంలో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే మ్యాక్స్‌వెల్ అనే సంస్థలో ఉద్యోగం చేసింది. అనారోగ్య సమస్యలతో ఉద్యోగాం మానేసిన ప్రియాంక అనంతరం తానే సొంతంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఓవర్‌సీస్ కన్సల్టెన్సీని ప్రారంభించింది. విసిటింగ్ వీసాల మీద విదేశాలకు పంపించి అక్కడికి వెళ్లిన తర్వాత వర్క్ వీసాగా మార్చుతాం అని నమ్మించేది.
ఇదే తరహా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న నారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కంబోడియాకు వెళ్లి వచ్చిన అతను అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ అవకాశాలు ఉన్నాయని యువకులను నమ్మించేవాడు. అక్కడే చైనాకు చెందిన జాన్‌జియా అనే సంస్థకు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జితేందర్ షా అలియాస్ ఆమెర్‌ఖాన్‌ను ప్రియాంకాకు పరిచయం చేశాడు.
కంబోడియాలో ఒప్పందం కుదుర్చుకుని : ఉద్యోగాలు వాటి వివరాలు తెలుసుకునేందుకు ప్రియాంక కంబోడియాకు వెళ్లింది. అక్కడ జితేందర్‌ను కలిసింది. ఉద్యోగాల కోసం పంపించే ఒక్కొక్కరికి 500 అమెరికా డాలర్ల కమీషన్ ఇస్తానని ప్రియాంకాతో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చిన ప్రియాంక యువకుల వేట ప్రారంభించింది.
విదేశాల్లో చదువు, ఉద్యోగాల కోసం నకిలీ సర్టిఫికెట్ల కేసు.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం