MP Etala Slams Congress :సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయలేక పిల్లిగంతులు వేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని ఆయన తెలిపారు. రుణమాఫీ కాలేదని మేడ్చల్‌లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున బీజేపీ దీక్ష చేపట్టబోతుందని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
"సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయలేక పిల్లిగంతులు వేస్తున్నారు. రాష్ట్రంలో 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. రుణమాఫీ కాలేదని మేడ్చల్‌లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, సోమవారం రోజు బీజేపీ దీక్ష చేపట్టబోతుంది. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలి". - ఈటల రాజేందర్, మల్కాజిగిరి ఎంపీ
హామీల విస్మరణ :కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు రైతుబంధు, రైతు బీమా, రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండాపోయిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అరాచక ప్రభుత్వంతో రైతులకు అన్యాయం జరుగుతోందని, రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నామన్నారు.