Mother Committed Suicide In Mahabubabad : పచ్చని సంసారంలో కలహాలు చిచ్చు రేపాయి. కుమార్తె సహా తల్లి ప్రాణాలు తీశాయి. మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త వివాహేతర సంబంధంపెట్టుకున్నాడన్న అనుమానంతో భర్తతో గొడవ పడి, ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకింది.
క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి, ఆ తర్వాత తానూ బావిలోకి దూకిఆత్మహత్యాయత్నానికిపాల్పడిన ఘటనలో తల్లీకుమార్తె మృతి చెందగా, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామ శివారు వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆకుల మురళికి, సిద్దిపేట జిల్లాకు చెందిన లావణ్యతో (30) వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు ముఖేష్ (10), కుమార్తె నిత్యశ్రీ (6) ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో గత కొద్ది కాలం నుంచి భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
రాత్రి గొర్రెల దగ్గర కాపలా ఉండగా, బావిలోంచి శబ్దాలు వినబడటంతో దగ్గరకు వెళ్లాను. అక్కడ పిల్లవాడు కనబడటంతో బయటకు తీశాను. పిల్లవాడు మా అమ్మ నన్ను, చెల్లిని బావిలో పడేసింది అని చెప్పాడు. దీంతో ఊర్లోవారందరికీ ఈ విషయాన్ని తెలియజేశాను. తల్లీకుమార్తెను బయటకు తీసి, ఆసుపత్రికి తరలించాం. అప్పటికే ఆ ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.- స్థానికుడు