తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

ETV Bharat / state

హైకోర్టు ఎక్క‌డ అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చొద్ద‌ని చెప్ప‌లేదు : జీవన్‌రెడ్డి - MLC Jeevan Reddy Comments bjp

MLC Jeevan Reddy Comments On BJP : బీజేపీ పార్టీ నేతలు రైతుల కోసం దీక్ష చేయడమే ఆశ్చర్యంగా ఉందని శాసమమండలి సభ్యులు జీవన్‌రెడ్డి అన్నారు. బీజేపీకి, రైతులకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించిన ఆయన బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ అంటూ విమర్శించారు. హైడ్రా కూల్చివేతలపై కొందరు నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. హైకోర్టు ఎక్క‌డ అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చొద్ద‌ని చెప్ప‌లేద‌న్న ఆయ‌న అక్రమ నిర్మాణాల కూల్చివేతలో నిబంధనలు పాటించాల‌ని మాత్రమే హైకోర్టు చెప్పిందని వివ‌రించారు.

MLC Jeevan Reddy On Hydra
MLC Jeevan Reddy Comments On BJP (ETV Bharat)

MLC Jeevan Reddy On Hydra: పేద‌ల సంక్షేమ‌మే లక్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. హైకోర్టు ఎక్క‌డ అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చొద్ద‌ని చెప్ప‌లేద‌న్న ఆయ‌న అక్రమ నిర్మాణాల కూల్చివేతలో నిబంధనలు పాటించాల‌ని మాత్రమే హైకోర్టు చెప్పిందని వివ‌రించారు. మూసీ నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామ‌న్న ఆయ‌న అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత ప్ర‌తి ప్ర‌భుత్వం చేసేదేన‌ని వెల్ల‌డించారు.

బీజేపీ రైతు దీక్ష : ఇందిరా పార్కు వ‌ద్ద దీక్ష చేస్తున్న బీజేపీ న‌గ‌రం అంతా ప్లెక్సీలు ఏర్పాటు చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. బీజేపీ రైతు దీక్ష చేస్తుందా లేక ప్రచారం చేసుకుంటుందా అని ప్ర‌శ్నించారు. బీజేపీ రైతుల‌ కోసం దీక్ష చేయడమే ఆశ్చర్యంగా ఉంద‌న్నారు. అసలు బీజేపీకి, రైతులకు ఏం సంబంధం ఉంద‌ని ప్ర‌శ్నించిన జీవ‌న్ రెడ్డి కాషాయదళం పెట్టుబడిదారుల పార్టీ అని ఆరోపించారు.

10ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతు సంక్షేమం కోసం ఏం చేసిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయాలన్న ఆలోచన కమలం నేతలకు ఎప్పుడూ చేయలేద‌ని ఆరోపించారు. అంబానీ, అదానీ వంటి పెట్టుబడిదారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేశార‌ని విమ‌ర్శించారు. గతంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం రుణమాఫీ చేసిన విష‌యాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.6 వేలు మాత్రమే ఇస్తోందని విమ‌ర్శించారు.

రాష్ట్రంలో సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామ‌న్న ఆయ‌న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మద్దతు ధరపైన బోనస్ ఇస్తున్నారా అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ రెండు సార్లు లక్ష రూపాయల రుణమాఫీ సరిగా చేయలేదని ఆరోపించారు. దీంతో అది కాస్తా వడ్డీ మాఫీ పథకంగా మారింద‌ని ఆరోపించారు.

రైతులకు వడ్డీ భారం పడొద్దనే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామ‌న్న ఆయ‌న రూ. 17వేల కోట్లు రుణమాఫీ ఒకేసారి చేయడం సాధార‌ణ విష‌యం కాద‌న్నారు. తెలంగాణలో 70శాతం మంది రైతులు రుణ విముక్తులు అయ్యార‌న్న ఆయ‌న త‌మ ప్ర‌భుత్వం రైతు ప్ర‌భుత్వమ‌ని స్ప‌ష్టం చేశారు. దేశవ్యాప్తంగా రుణమాఫీ కోసం బీజేపీ నేతలు దిల్లీలోని వాళ్ల పార్టీ ఆఫీసు ముందు ధర్నా చేయాల‌ని సూచించారు.

"పేద‌ల సంక్షేమ‌మే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది.హైకోర్టు ఎక్క‌డ అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చొద్ద‌ని చెప్ప‌లేద‌ు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో నిబంధనలు పాటించాల‌ని మాత్రమే చెప్పింది. ఇందిరా పార్కు వ‌ద్ద దీక్ష చేస్తున్న బీజేపీ న‌గ‌రం అంతా ప్లెక్సీలు పెట్టింది. బీజేపీ రైతు దీక్ష చేస్తుందా లేక ప్రచారం చేసుకుంటుందా. 10ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ రైతు సంక్షేమం కోసం ఏమి చేసిందో చెప్పాలి." - జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ

రాబోయే రోజుల్లో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండొద్దు : మంత్రి పొన్నం - Poshana Aarogya Jatara Program

హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి - MLC Jeevn Reddy On Hydra

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details