MLC ELECTION SCHEDULE: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చేసింది. ఏపీలో 5 ఖాళీలకు షెడ్యూలు విడుదల చేసింది. మార్చి 3 తేదీన ఈ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 20వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టంచేసింది.
ఏపీలో ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ స్థానాలు - ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది - MLC ELECTION SCHEDULE
ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల - మార్చి 29తో ముగియనున్న ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం

MLC Election (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2025, 2:18 PM IST
మార్చి 10 తేదీన నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా పేర్కొంది. మార్చి 29 తేదీ నుంచి ఖాళీ అవుతున్న ఐదు స్థానాలకు ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 29తో ఐదుగురు ఎమ్మెల్సీలు పదవీ కాలం ముగియనుంది. ఐదుగురు ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, పర్చూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బి.తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడుల పదవీ కాలం ముగియనుందని స్పష్టంచేసింది. అదే విధంగా తెలంగాణలోనూ 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.