MLA Somireddy Comments On Ys Jagan : జగన్ అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొంటాను అంటే కుదరదని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నుకున్న 11 మంది అసెంబ్లీకి రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక విద్యార్థి పరీక్షలకు గైర్హాజరైతే ఆయన్ను పాస్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద శాసనాలు చేయాలని ఆయా నియోజకవర్గాల ప్రజలు పంపించారని తెలిపారు. అంతేగాని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రాకుండా ప్రజాప్రతినిధులు ఇంట్లో అలిగి కూర్చుంటారా? అని మండిపడ్డారు. బడ్జెట్ చర్చలో భాగంగా శానససభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు ఇంట్లో జరిగినవి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ధనం ఖర్చు చేసి ఎన్నికలు నిర్వహించి చట్ట సభకు పంపించిందని గుర్తుచేశారు. అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా రానంటే చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ చెప్పుకొచ్చిన జగన్ వారిని నిండా ముంచారని సొమిరెడ్డి వ్యాఖ్యానించారు. వారికి కట్టిన ఇళ్లు అన్నీ పెచ్చులు ఊడుతున్నాయని ఆక్షేపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో దారుణమైన దోపిడీ జరిగిందని అన్నారు. రీ సర్వే గురించి ఎవరు అడిగారని, తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులపై ఆయన బొమ్మ వేసుకోవడం ఏమిటని సోమిరెడ్డి మండిపడ్డారు.
ప్రతిపక్ష హోదా కావాలని శాసిస్తారా? - అది ప్రజలే ఇవ్వాలి:సీఎం చంద్రబాబు