MLA Kadiyam Srihari on Six Guarantees Budget : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరిట 13 హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ రాగానే హామీల విషయంలో చేతులెత్తేసేపనిలో హస్తం పార్టీ ఉందని ఆరోపించారు. వచ్చే ఆరు మాసాల్లో కూడా ఇచ్చిన హామీలు అమలు చేసేలా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు రూ.4 వేలు ఇస్తామన్నారని కానీ దీని గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదని తెలిపారు. యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్(Telangana Job Calendar) ప్రకటిస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. వీటికి కూడా బడ్జెట్‌లో ఎక్కడా కేటాయింపులు లేవని వెల్లడించారు.
Kadiyam Srihari Assembly Speech : ఎస్సీ, ఎస్టీలకు బీఆర్ అంబేడ్కర్ అభయ హస్తం పేరుతో రూ.12 లక్షలు ఆర్థికసాయం చేస్తామన్నారని, కానీ బడ్జెట్‌లో ఎక్కడా చూపించలేదనికడియం శ్రీహరిఅన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్నే అంబేడ్కర్ అభయ హస్తంగా పేరు మార్చారని పేర్కొన్నారు. సరూర్‌నగర్‌లో ప్రియాంక గాంధీ యువత డిక్లరేషన్ ప్రకటించారని, అవే కాకుండా ఇంకా చాలా డిక్లరేషన్లు ప్రకటించారని కానీ వాటి గురించి ప్రస్తావన లేదని అన్నారు. బీసీలకు బడ్జెట్‌లో లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారని లెక్కల్లో చూపించలేదని మండిపడ్డారు.
అద్దెకు ఉండే వారికీ 'గృహజ్యోతి' వర్తింపు - ముమ్మరంగా వినియోగదారుల వివరాల సేకరణ
'చేయూత పథకానికి ఏడాదికి రూ.30వేల కోట్లు కావాలి. బీఆర్ఎస్ పాలనలో పరిశ్రమలు, ఐటీ నుంచి 26లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ చేయలేదు. రైతు రుణమాఫీని ఏ విధంగా ఎప్పటిలోగా చేస్తారో స్పష్టత ఇవ్వాలి. కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టతో పాటు స్థిరీకరణ జరిగింది. ఈ విషయంలో గోరంతను కొండంత చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అనేక రిజర్వాయర్లు వచ్చాయి. నీటి నిల్వ సామర్థ్యం పెంచుకున్నాం'- కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే